కేటీఆర్, సంతోష్ కనుసన్నల్లో పోచంపల్లి ఫౌంహౌస్ దందా..టీపీపీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్

కేటీఆర్, సంతోష్ కనుసన్నల్లో పోచంపల్లి ఫౌంహౌస్ దందా..టీపీపీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్

హైదరాబాద్: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ  పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి ఫాంహౌజ్ కోళ్ళపందాల ఘటన దుమారం రేగుతోంది. బీఆర్ఎస్ హయాంలో కేటీఆర్, సంతోష్ కనుసన్న ల్లోనే పోచంపల్లి ఫాంహౌజ్ దందా నడిచిందని  టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు.  బీఆర్ ఎస్ హయాంలో  తెలంగాణలో యువతను మత్తు లో ముంచారని అన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని క్యాసినో హబ్ గా కేటీఆర్ మార్చారని విమర్శించారు. 

బీఆర్ ఎస్ హయాంలో రాష్ర్టంలో రాక్షసపాలన సాగింది. కేటీఆర్ డ్రగ్స్ తో తెలంగాణను నాశనం చేశారు.. బినామీలకు క్యాసినో, కోళ్ల పందాలు అప్పగించారని అన్నారు. కేటీఆర్, సంతోష్ కుమార్ లకు ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి భాగస్వాములుగా ఉన్నారని చెప్పారు. 

ALSO READ | ఫాంహౌస్లో కోడి పందేలు..బీఆర్ఎస్ ఎమ్మెల్సీకి నోటీసులు

బీఆర్ ఎస్ హయాంలో సన్ బర్న్ పార్టీలో పేరుతో హైదరాబాద్ లో పాశ్చాత్య సంస్కృతిని తీసుకొచ్చిన చరిత్ర బీఆర్ ఎస్ నేతలదని విమర్శించారు. జన్వాడ ఫాం హౌ జ్ కేసులో డ్రగ్స్ ఇచ్చిన కేసులో పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డికి లిందని అనుమానాలు వ్యక్తం చేశారు. అన్నారు. ఫాంహౌజ్ లలో క్యాసినో, పేకాట, కోళ్ల పందేలు ఆడి స్తూ తెలంగాణ సమాజాన్ని జూదం వైపు మళ్లిస్తున్నారని అన్నారు. కేటార్ అండతోనే ఇలాంటి పనులు జరుగుతున్నాయన్నారు. 

తెలంగాణ లో జరిగే అన్ని రకాల జూదాలకు కేటిఆరే నాయకుడు. బీఆర్ ఎష్ నేతలు ఏదో అవినీతిలో భాగస్వాములే అన్నారు. అందరిపైనా విచారణ జరిపి తెలంగాణ యువతను కాపాడాలని ప్రభుత్వాన్ని కోరుతున్నానని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు.