
- కేటీఆర్, సంతోష్ కనుసన్నల్లో పోచంపల్లి ఫాంహౌస్‌లో దందా: పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్
హైదరాబాద్, వెలుగు: బీఆర్ఎస్వర్కింగ్ప్రెసిడెంట్ కేటీఆర్.. తెలంగాణను క్యాసినో హబ్‌గా మార్చాడని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ధ్వజమెత్తారు. రాష్ట్రంలోని యువతను మత్తులో చిత్తు చేస్తున్నాడని ఆరోపించారు. కేటీఆర్.. డ్రగ్స్ తో తెలంగాణను నాశనం చేసి.. ఆయన బినామీలకు క్యాసినో, కోళ్ల పందాలు అప్పగించాడని విమర్శించారు. గురువారం ఆయన హైదరాబాద్ లో మీడియాకు ఓ ప్రకటన విడుదల చేశారు. కేటీఆర్, సంతోష్ లకు వ్యాపార భాగస్వామిగా ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి ఉన్నారని, బీఆర్ఎస్ హయాంలో వారిద్దరి కనుసన్నల్లో పోచంపల్లి ఫాంహౌస్ దందా నడిచిందన్నారు.
జన్వాడ ఫాం హౌస్ కేసులో అప్పుడు డ్రగ్స్ ఇచ్చిన కేసుతో పోచంపల్లికి లింక్ ఉందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయన్నారు. దీని వెనుక కేటీఆర్ అండదండలు ఉన్నాయని, దాంతోనే పోచంపల్లి ఇలాంటి చట్టవ్యతిరేక పనులు చేస్తున్నాడని పీసీసీ చీఫ్ ఆరోపించారు. బీఆర్ఎస్ హయాంలో ఇచ్చిన పర్మిషన్లతోనే పోచంపల్లి ఫాంహౌస్‌లో గత రెండేండ్లుగా ఈ దందాలు సాగుతున్నాయని విమర్శించారు.