నాలాల దగ్గరున్నోళ్లు ఖాళీ చేస్తే డబుల్ ఇండ్లిస్తం

మల్కాజ్​గిరి వరద ప్రాంతాల పర్యటనలో కేటీఆర్

జనం కాచి వడబోసిన నీటిని తాగాలని సూచన​

హైదరాబాద్, వెలుగు: వరదల వల్ల ఇబ్బంది పడుతున్న ప్రజలకు రేషన్ కిట్ లతో పాటు అన్ని సౌకర్యాలు కల్పించేందుకు జీహెచ్ఎంసీ ప్రయత్నిస్తోందని, పారిశుధ్యానికి ప్రాధాన్యం ఇస్తామని మంత్రి కేటీఆర్ తెలిపారు. తాగునీటి విషయంలో జనం జాగ్రత్తగా ఉండాలని, కాచి వడబోసిన నీటినే తాగాలని సూచించారు. శుక్రవారం మల్కాజ్​గిరి పటేల్​నగర్​ ప్రాంతంలో పర్యటించిన కేటీఆర్​.. నాలా పరిసరాల్లోని జనం ఖాళీ చేస్తే డబల్​బెడ్రూమ్​లు వెంటనే ఇస్తామని, మిగతా వారికి నష్టపరిహారం అందజేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామని చెప్పారు. నాలా విస్తరణ పనులను చేపడతామన్నారు. తర్వాత ఖైరతాబాద్ లోని ఎంఎస్ మక్త కాలనీలో జీహెచ్​ఎంసీ ఏర్పాటు చేసిన షెల్టర్ హోమ్​ను, అక్కడి సౌకర్యాలను పరిశీలించారు. మంత్రితో పాటు స్థానిక ఎమ్మెల్యే దానం నాగేందర్, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతి, జీహెచ్ఎంసీ అధికారులు ఉన్నారు. ఆ తర్వాత బేగంపేట‌‌‌‌లోని ప్రకాశ్ న‌‌‌‌గ‌‌‌‌ర్‌‌‌‌, బ్రాహ్మణ‌‌‌‌వాడి ప్రాంతాల‌‌‌‌ను వాళ్లు ప‌‌‌‌రిశీలించారు. రేష‌‌‌‌న్ కిట్లతో పాటు దుప్పట్లను స్థానికుల‌‌‌‌కు అంద‌‌‌‌జేశారు. వ‌‌‌‌ర‌‌‌‌ద నీరు త‌‌‌‌గ్గిన‌‌‌‌ ప్రాంతాల్లో పారిశుధ్య ప‌‌‌‌నులు వేగ‌‌‌‌ం చేయాల‌‌‌‌ని అధికారుల‌‌‌‌ను ఆదేశించారు.

బిల్డింగులు చూసి ఫొటోలు దిగితే సాల్నా..

కేటీఆర్​పై మల్కాజ్​గిరి జనం మండిపాటు​

‘బిల్డింగులు చూసి ఫొటోలు దిగితే అయిపాయెనా.. మా సమస్యలేందో పట్టించుకోరా’ అంటూ మంత్రి కేటీఆర్​పై మల్కాజ్​గిరి వరద బాధిత ప్రాంతాల జనం మండిపడ్డారు. మంత్రి కొందరి ఇండ్ల దగ్గరికే వెళ్లడంతో సమస్యలెవరికి చెప్పుకోవాలని కాలనీ వాసులు వాపోయారు. మూడురోజుల క్రితం ఆగమాగం చేసిన వానతో తిండి, నీరు లేక మస్తు తిప్పలు పడుతున్నమని.. కొన్ని ఇండ్లనే చూసి ఫోటోలు దిగిపోతే తమను పట్టించుకునే వారెవరని ప్రశ్నించారు.

For More News..

పెరిగిన భారతీయుల ఆయువు

నీట్‌లో తెలంగాణ బిడ్డకు థర్డ్ ర్యాంక్