
తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ ను కూల్చే ఆలోచన తమకు లేదని..అవసరమైతే ప్రజలే కూలుస్తారన్నారు మాజీ మంత్రి కేటీఆర్. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలే ఆగ్రహంగా ఉన్నారని చెప్పారు.బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి చెప్పింది నిజమేనన్నారు. కాంగ్రెస్ సర్కార్ ను కూలగొట్టేందుకు ప్రజలే చందాలు కూడా ఇస్తామంటున్నారని చెప్పారు. కానీ ఐదేళ్లు రేవంతే సీఎంగా ఉండాలని తాను కోరుకుంటున్నానని చెప్పారు. ఈ దిక్కుమాలిన ప్రభుత్వాన్ని కూలగొట్టాల్సిన కర్మ కానీ అవసరం కానీ తమకు లేదన్నారు కేటీఆర్.
సీఎంకు దమ్ముంటే సెక్యూరిటీ లేకుండా గ్రామాల్లోకి రావాలి..అపుడే జనం ఏమనుకుంటున్నారో తెలుస్తదన్నారు కేటీఆర్. కొందరు పోలీసులు రేవంత్ రెడ్డి సైన్యంలా పనిచేస్తున్నారని అన్నారు కేటీఆర్. ఇష్టానుసారం కేసులు పెట్టిన వారిపై సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామన్నారు కేటీఆర్. రీ ట్వీట్ చేస్తే కూడా కేసులు పెట్టడం దుర్మార్గమన్నారు. రేవంత్ రెడ్డి ప్రైవేట్ సైన్యంలా పనిచేస్తే పోలీసులు ఊచలు లెక్కించాల్సి వస్తదని హెచ్రచరించారు కేటీఆర్.
వ్యాపారవేత్తలు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు,బిల్డర్లు తెలంగాణలోని సర్కార్ పట్ల అసంతృప్తిగా ఉన్నారని..ప్రభుత్వాన్ని కూల్చాలంటూ తమకు సలహాలు ఇస్తున్నారని కొత్త ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే..దీనిపై కాంగ్రెస్ నేతలు గట్టిగానే కౌంటర్ ఇవ్వడంతో మళ్లీ కొత్త ప్రభాకర్ రెడ్డి మాట మార్చి తమకు ప్రభుత్వాన్ని కూల్చాలనే ఆలోచన లేదని అన్నారు.