
కంచ గచ్చిబౌలి భూములు ముమ్ముటీకి అటవి భూములేనన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఆ 400 ఎకరాలు ప్రభుత్వానిది కాదని హెచ్ సీయూదేనని చెప్పారు. వాల్టా చట్టం,ఫారెస్ట్ యాక్ట్ ను ప్రభుత్వం ఉల్లంఘించిందన్నారు. గచ్చిబౌలి భూముల్లో ఫైనాన్షియల్ ఫ్రాడ్ జరిగిందన్నారు కేటీఆర్. అటవి భూమిని సర్కార్ తాకట్టు లేదా అమ్మే ప్రయత్నం చేస్తోందన్నారు. ఈ భూముల వెనుక రూ. 10 వేల కోట్ల స్కాంకు తెరలేపిందని కేటీఆర్ ఆరోపించారు. మ్యూటేషన్ కానీ భూములను తాకట్టు పెట్టి 10 వేల కోట్లు లోన్ తెచ్చారని ఆరోపించారు.
►ALSO READ | ఒక చేత్తో డ్రైవింగ్.. మరో చేత్తో టికెట్లిచ్చిన డ్రైవర్.. ఫ్లై ఓవర్ పై లారీని ఢీ కొట్టిన ఆర్టీసీ బస్స
గచ్చిబౌలి భూములతో కాంగ్రెస్ సర్కార్ సరికొత్త ఆర్థిక నేరానికి తెరలేపిందన్నారు. 2004లో ఐఎంజీ కంపెనీకి అప్పటి సర్కార్ భూములిచ్చిందన్నారు కేటీఆర్. భూములపై బీఆర్ఎస్ సర్కార్ కోర్టులో ఫైట్ చేసిందని చెప్పారు. ట్రస్ట్ అడ్వైజరీ కంపెనీ ప్రభుత్వానికి 169 కోట్ల లంచం ఇచ్చిందని ఆరోపించారు కేటీఆర్. భూములను అమ్మేందుకు బ్రోకర్ ను తీసుకొచ్చింది ఓ బీజేపీ ఎంపీనే. గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూమి ప్రభుత్వానిది కాదు..ఆ భూమి ఇంకా మ్యూటేషన్ కాలేదు.. సేల్ డీడ్ కూడా లేదన్నారు. మోసం విధ్వంస దృష్టి మళ్లించడమే కాంగ్రెస్ విధానమన్నారు కేటీఆర్.