వరంగల్ కు మోనో రైల్ తెస్తాం

కేసీఆర్ కు వరంగల్ పై ప్రత్యేక ప్రేమ ఉందన్నారు మంత్రి కేటీఆర్. ఇవాళ 2 వేల 500కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశామని తెలిపారు. హైదారాబాద్  గ్లోబల్ సిటీ అయితే... వరంగల్ ను ఫ్యూచర్ సిటీగా మారుస్తామన్నారు. వరంగల్ కు త్వరలో మోనో రైల్ తెస్తామని చెప్పారు. కార్పొరేషన్ ఎన్నికల్లో టీఆర్ఎస్ ను ఆదరించాలని కోరారు కేటీఆర్. బీజేపీ నాయకులు కొత్త బిక్షగాళ్లని విమర్శించారు. మోడీ ఇస్తానన్న 15లక్షలు ఏమయ్యాయి.. కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏమైందని ప్రశ్నించారు. మోడీ హయాంలో పెట్రోల్, గ్యాస్ ధరలు పెరిగాయన్నారు.  కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు అన్యాయం చేస్తోందన్నారు కేటీఆర్. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం ఆలస్యం జరిగిన మాట వాస్తవన్నారు. కరోనా కారణంగా నిధుల కొరత వల్ల డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం ఆలస్యం అయ్యిందన్నారు.