
హైదరాబాద్, వెలుగు: సీఎం పేమెంట్ కోటా అని స్వయంగా కాంగ్రెస్ మంత్రే చెబుతున్నారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఈ విషయం రాష్ట్రంలోని చిన్న పిల్లవాడికి కూడా తెలుసని పేర్కొన్నారు. హెచ్‌సీయూలో ఆందోళనలను పెయిడ్ బ్యాచ్ చేయిస్తున్నదన్న మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వ్యాఖ్యలకు బుధవారం ఆయన ‘ఎక్స్’లో కౌంటర్ ఇచ్చారు. ఐటీ పార్కులు, ఇతర కార్యకలాపాలకు ఫ్యూచర్ సిటీలో 14 వేల ఎకరాలు రెడీగా ఉన్నప్పుడు హెచ్‌సీయూ భూములపైనే ఎందుకు కన్నేశారని ప్రశ్నించారు. భవిష్యత్ తరాలకు సిటీని లేకుండా నాశనం చేయడం ఎందుకని నిలదీశారు.