కమీషన్ల కోసమే మూసీ సుందరీకరణ : కేటీఆర్

కమీషన్ల కోసమే మూసీ సుందరీకరణ : కేటీఆర్

కమీషన్ల కోసమే రేవంత్ రెడ్డి మూసీ సుందరీకరణ చేపట్టారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. మూసీ పేరు మీద.. రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ‌‌, రాబర్ట్ వాద్రాలు డబ్బులు పంచుకుంటారని వ్యాఖ్యానించారు.  రుణమాఫీ కోసం రైతులు జిల్లా కలెక్టర్లను కలవాలని సీఎం రేవంత్ అనడం దుర్మార్గమన్నారు. ప్రజలు కలెక్టర్లకు ఓట్లు  వేయలేదు. ఓట్లు వేసింది కాంగ్రెస్ అభ్యర్థులకన్నారు. 

రేవంత్ సొంత నియోజకవర్గం కొండగల్ లో రైతల భూములను ప్రభుత్వం గుంజుకుంటోందని ఆరోపించారు.  రైతుల పక్షాన పాదయాత్ర చేస్తోన్న పట్నం నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేయటాన్ని ఖండిస్తున్నానన్నారు కేటీఆర్. రేవంత్  ముందు ఆయన సొంత ఇంటిని చక్కదిద్దుకోవాలని విమర్శించారు కేటీఆర్.  ప్రజాభిప్రాయంతో కొండగల్ ప్రజలను ఒప్పించి భూములను తీసుకోవాలన్నారు.  రుణమాఫీ కోసం కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్యేలను నిలదీయాలని పిలుపునిచ్చారు.  

గ్యారంటీల పేరుతో మోసం చేస్తోన్న కాంగ్రెస్ కు హర్యానా ప్రజలు బుద్ది చెప్పారని విమర్శించారు కేటీఆర్.  బతుకమ్మ పండుగకు డీజేలకు పర్మిషన్లు బంద్ చేయటం దుర్మార్గమన్నారు.  రేవంత్ రెడ్డి వచ్చాక ఎమ్మార్వోలను కొట్టే పరిస్థితి వచ్చిందన్నారు. తులం బంగారం కాదు కదా.. తులం ఇనుము కూడా రేవంత్ ఇవ్వరన్నారు.  ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని రాహుల్ గాంధీ మోసం చేశాడన్నారు.  సంక్షేమ పధకాల అమలుకు లేని డబ్బులు మూసీ సుందరీకరణకు ఎక్కడివని ప్రశ్నించారు.   ప్రజల పక్షాన పోరాటం చేయటానికి బీఆర్ఎస్  ఉందన్నారు కేటీఆర్.