రైతుబంధు ఎగిరిపోయింది.. రాబందుల రెక్కల చప్పుడే మిగిలింది: కేటీఆర్

రైతుబంధు ఎగిరిపోయింది.. రాబందుల రెక్కల చప్పుడే మిగిలింది:  కేటీఆర్

 హైదరాబాద్: తెలంగాణలో బుల్డోజర్ రాజ్ సంస్కృతిని తీసుకురావటంతో ఫలితాలు కూడా బుల్డోజర్ ఎకానమీ మాదిరిగా వస్తున్నాయని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. విధ్వంసకర విధానాలతో జీఎస్టీ వసూళ్లలో రాష్ట్రం ఆఖరి స్థానంలో నిలిచి అనూహ్యమైన ఘనతను సాధించిందని సెటైర్ వేశారు. 'గతే డాదితో పోల్చుకుంటే తొలిసారిగా తెలంగాణ లో జీఎస్టీ వసూళ్లు 1 శాతం కంటే తక్కువకు పడిపోయాయి. రాష్ట్రంలో ఎప్పుడు కనీసం 15 శాతం వృద్ధిని సాధించేది. కానీ ఇప్పుడు ఉత్తర ప్రదేశ్ ఆర్థిక వ్యవస్థతో విజయవంతంగా పోటీ పడుతోంది! రాష్ట్రంలో ఆబ్కారీ శాఖ మాత్రమే మంచి పనితీరు కనబరుస్తూ గొప్పగా ఫలితాలు నిస్తోంది. తెలంగాణ వంటి సంపూర్ణంగా అభి వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థను నాశనం చేయడానికి ప్రత్యేక ప్రతిభ అవసరం! ఈ తిరోగమన పరిస్థితి పై సీఎం సమాధానం చె బుతారని ఆశిస్తున్న' అని ట్వీట్ చేశారు.

రాబందుల రెక్కల చప్పుడే 

రైతుల ద్రోహి కాంగ్రెస్ పార్టీ అని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. 'రైతుబంధు కావాలా..? రాబందు కావాలా?. ఎన్నికల ముందు బీఆర్ఎస్ఇ ఇచ్చిన నినాదం గుర్తుందా?. రైతుబంధు ఎగిరిపోయింది.. రాబందుల రెక్కల చప్పుడే మిగిలింది!. నమ్మి నానబోస్తే పుచ్చి బుర్రలైనట్టుంది పరిస్థితి... ఎకరానికి 15వేలు ఇస్తామ ఊదరగొట్టి.. ఉన్న పదివేలు ఊడగొట్టారు!. పంట పెట్టుబడి ఎగ్గొట్టడం అంటే.. అన్నదాత వెన్ను విరవడమే..!. రైతు ద్రోహి కాంగ్రెస్.. చరిత్ర నిండా అనేక రుజువులు.. ఇప్పుడు ఇంకొకటి!' అంటూ ట్వీట్ చేశారు కేటీఆర్.

ALSO READ | తూకం పేరుతో మోసం చేస్తారు జాగ్రత్త..