9 నెలలుగా నిరసన చేస్తున్నా సీఎం పట్టించుకోవట్లే : కేటీఆర్

9 నెలలుగా నిరసన చేస్తున్నా సీఎం పట్టించుకోవట్లే : కేటీఆర్

తెలంగాణ ఉద్యమంలో మానుకోటకు ప్రత్యేక స్థానం ఉందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.  లగచర్ల బాధితులకు  మహబూబ్ నగర్ లో మద్దతుగా నిర్వహించిన  ధర్నాలో మాట్లాడిన కేటీఆర్.. కొత్త నియంత రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్పేందుకు మానుకోట గడ్డ సిద్ధమైందన్నారు.  సీఎం సొంత నియోజకవర్గంలోనే నిరసనలు ఎదుర్కొంటున్నారని అన్నారు.  రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కూకటివేళ్లతో పెకిలించే వరకూ పోరాడతామని చెప్పారు.  అల్లుడికి ఫార్మా కంపెనీ అప్పగించేందుకే రైతుల భూములు గుంజుకుంటున్నారని ఆరోపించారు కేటీఆర్. ప్రజల కోసం లబ్దిచేకూర్చే పనులు చేయకుండా... కుటుంబానికి లాభం చేసేందుకే రేవంత్ పనిచేస్తున్నారని విమర్శించారు.

లగచర్లకు అధికారులు పోతే దాడి చేశారు కానీ..  రేవంత్ రెడ్డి పోతే ఉరికించి కొట్టే వాళ్లన్నారు కేటీఆర్.  ఫార్మా విలేజ్  కోసం 3వేల ఎకరాలు సేకరిస్తామంటే లగచర్ల రైతులు నిరసనకు దిగారని అన్నారు. 9 నెలలుగా నిరసన చేస్తున్నా కొడంగల్ రైతులను  సీఎం పట్టించుకోవడం లేదన్నారు. ఊరురా రేవంత్ రెడ్డి సర్కారుకు బుద్ధి చెప్పేందుకు రెడీగా ఉన్నారని అన్నారు కేటీఆర్.