కేటీఆర్ దిగజారి మాట్లాడుతున్నడు : సామ రామ్మోహన్ రెడ్డి

  • టీపీసీసీ మీడియా కమిటీ  చైర్మన్ సామ రామ్మోహన్ రెడ్డి 

హైదరాబాద్, వెలుగు: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తన స్థాయికి దిగజారి వ్యాఖ్యలు చేస్తున్నారని టీపీసీసీ మీడియా కమిటీ చైర్మన్ సామ రామ్మోహన్ రెడ్డి తెలిపారు. ఎవరైనా భార్యను మారుస్తారు గానీ, తల్లిని మార్చుతారా..? అని మాట్లాడటం ఆయన దిగజారుడుతనానికి నిదర్శనమని చెప్పారు. బుధవారం గాంధీ భవన్​లో మీడియాతో సామ రామ్మోహన్ రెడ్డి మాట్లాడారు.

కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని ఓర్చుకోలేక ఆయన లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటుపై రాజకీయం  చేయడం సరికాదని హితవు పలికారు. కేటీఆర్ వ్యాఖ్యలతో కేసీఆర్ కుంగిపోతున్నారని, కేటీఆర్ వల్లే పార్టీకి నష్టం జరుగుతుందని పేర్కొన్నారు. పదేండ్ల నుంచి తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఎందుకు ఏర్పాటు చేయలేదని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటును యావత్ తెలంగాణ ప్రజలు స్వాగతిస్తున్నారని వెల్లడించారు.