అధికారంలోకి రావడం కోసం ఇష్టమొచ్చిన హామీలు ఇచ్చిన కాంగ్రెస్.. కాంగ్రెస్ 5 నెలలు టైమ్ పాస్ చేసిందని విమర్శించారు మాజీ మంత్రి కేటీఆర్. అధికారంలోకి వచ్చిన తర్వాత 6 గ్యారంటీలు పూర్తి స్థాయిలో అమలు కావడం లేదని ప్రజలకు అర్థమైందని చెప్పారు. బీఆర్ఎస్ పార్టే తెలంగాణకు శ్రీరామ రక్ష అని ప్రజలందరూ భావిస్తున్నారని అన్నారు కేటీఆర్. కాంగ్రెస్, బీజేపీ ఎన్ని ప్రయత్నాలు చేసినా అత్యధికంగా మెజార్టీ సీట్లు బీఆర్ఎస్ సాధిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
మే 14వ తేదీ మంగళవారం సిరిసిల్ల తెలంగాణ భవన్ లో కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. పార్లమెంటు ఎన్నికల్లో పార్టీ కోసం కష్టపడిన గులాబి సైకులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. గత ఎన్నికల్లో కొందరి స్వార్థంతో ఓడిపోయామని.. పార్టీ కోసం కష్టపడిన అందరికీ స్థానిక సంస్థలు ఎన్నికల్లో అవకాశం కల్పిస్తామని చెప్పారు. పార్లమెంటు ఎన్నికల్లో అందరికీ సముచిత స్థానం కల్పించి పోటీలో నెలబెట్టామన్నారు. రాష్ట్రంలో పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీపై ఆడ బిడ్డలు కూడా తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని చెప్పారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత కనిపిస్తుందన్నారు.
ఢిల్లీలో కుస్తీలు.. గల్లీలో దోస్త్ ల్లాగా రెండు పార్టీలు వ్యవరిస్తున్నాయని మండపడ్డారు కేటీఆర్. ఎంపీ ఎన్నికల్లో డమ్మీ అభ్యర్హులను నిలబెట్టి.. బీజేపీ అభ్యర్థులు గెలిచేలా రేవంత్ రెడ్డి ప్రణాళికలు చేశాడని ఆరోపించారు. కేసీఆర్ బస్ యాత్రతో అనేక మార్పులు తీసుకోస్తూ.. స్థానిక సమస్యలు ఎత్తు చూపుతూ బస్ యాత్రను కొనసాగించారన్నారు. కేసీఆర్ బస్ యాత్రకు ప్రజలు బ్రహ్మ రథం పట్టారని చెప్పారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితి బాగాలేదని.. ఆ పార్టీ బుద్ధి తెచ్చుకొని 420 హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నానని కేటీఆర్ అన్నారు.