బండి సంజయ్కు కరీంనగర్లో పోటీ చేసే దమ్ము లేదు: కేటీఆర్

 బండి సంజయ్ కు కరీంనగర్ లో పోటీ చేసే దమ్ము లేదన్నారు మంత్రి కేటీఆర్. ఎంపీగా గెలిచిన బండి సంజయ్  చేసిందేమి లేదన్నారు. ఇక్కడి నుంచి పారిపోయి ఎల్బీ నగర్లో పోటీ చేయాలా? వేములవాడలో పోటీ చేయాలా అని ఆలోచిస్తున్నారని విమర్శించారు.   కాంగ్రెస్,  బీజేపీ గెలిస్తే రాష్ట్రం మళ్లీ 50 ఏండ్లు వెనక్కి పోతుందని విమర్శించారు ప్రజలు ఆలోచించుకుని ఓటు వేయాలన్నారు.  ఈ సారి కరీంనగర్ నుంచి చెంపపెట్టులాంటి తీర్పు ఇవ్వాలని కోరారు.

తెలంగాణకు ఏమీ చెయ్యని..ఇయ్యని మోదీ ఎవరికి దేవుడని కేటీఆర్ ప్రశ్నించారు. కేసీఆర్ ఎన్నడూ మతం పేరుతో రాజకీయం చేయలేదన్నారు. తాను హిందువని కేసీఆర్ గర్వంగా చెప్పుకున్నాడని.. దేశంలో ప్రధాని కూడా చెయ్యని చండీయాగాన్ని  కేసీఆర్ చేశారని చెప్పారు.  గత ఎన్నికల్లో  మతం పేరుతో కరీనంగర్ లో బీజేపీ వాళ్లు ఓట్లు వేయించుకున్నారని.. ఈ సారి అలా జరగకూడదన్నారు.

Also Read :- తెలంగాణపై మోదీ మాటలను సోనియా, రాహుల్ ఖండించలేదు 

కరీంనగర్ నుంచే  తెలంగాణ పోరు మొదలైందన్నారు కేటీఆర్. తెలంగాణలో ఎన్నో మార్పులు తెచ్చామని.. అన్నిరంగాల్లో  అభివృద్ధి చేసి చూపించామన్నారు. సీఆర్ మళ్లీ సీఎం అయితే పెన్షన్ రూ.5 వేలు అవుతుందన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా కేసీఆర్ వైట్ రేషన్ కార్డున్న ప్రతి ఒక్కరికి రూ. 5  బీమా పథకాన్ని తీసుకొస్తున్నారని చెప్పారు