నిన్న మొన్న రాహుల్ గాంధీ వచ్చి, తెలంగాణను ఆగం చేయాలని చూస్తున్నారని మంత్రీ కేటీఆర్ ఆరోపించారు. దొరల తెలంగాణ కావాలా, ప్రజల తెలంగాణ కావాలా అని అడుగుతున్నారని.. రాహుల్ గాందీ ఛాలెంజ్ కి తాను సిద్దమని తెలిపారు. రాజనక్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గంలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి చల్మెడ లక్ష్మీ నరసింహ రావు తరపున సోమవారం(నవంబర్ 6) మంతి కేటీఆర్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఢిల్లీ దొరలకు, తెలంగాణ ప్రజలకు మధ్య ఈ ఎన్నికలు జరుగుతున్నాయని అన్నారు. ఈ ఎన్నికలు మా కోసం కాదని.. ప్రజల కోసం పని చేసే పార్టీ గెలిపించుకోకపోతే ..తెలంగాణ ఆగం అవుతుందన్నారు. మా పోరాటం ఇక్కడ నిలబడ్డ వ్యక్తితో కాదని.. కాంగ్రెస్ తో మాత్రమే పోటీ అని అన్నారు.
సింహం సింగిల్ గానే వస్తుంది, పందులు గుంపు గుంపులుగా వస్తున్నాయని ప్రతిపక్షాలపై మంత్రి కేటీఆర్ వ్యంగ్యస్త్రాలు విసిరారు. ఒక్క కేసీఆర్ ను ఓడగొట్టడానికి ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారని అన్నారు. డికే శివ కుమార్ మన నెత్తి మీద పాలు పోసి పోయాడని.. ఆయననను మళ్లీ పిలవడం లేదని ఎద్దేవా చేశారు. గుజరాత్, ఢిల్లీ నుంచి వచ్చినవారు కేసీఆర్ ను ఏం చేయలేరని చెప్పారు. కేసీఆర్ ను ఓడగొట్టేందుకు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ భవిషత్ నిర్ణయం ఢిల్లీలో కాదు.. గల్లీలోనే తీసుకోవాలని అన్నారు.
వేములవాడను దత్తత తీసుకుంటానని.. గెలిపించక పోతే ఇక్కడికి రానని కేటీఆర్ అన్నారు. లక్ష్మీ నరసింహ రావు కోసం కాదు.. కేసీఆర్ కోసమే ఆలోచన చేయాలన్నారు. డిసెంబర్ 3న లక్ష్మీ నరసింహ రావును గెలిపించాలని కోరారు. కేసీఆర్ అంటే నమ్మకం, భరోసా.. సెంటి మెంట్స్, అయింట్ మెంట్ లకు లోంగొద్దని కేటీఆర్ చెప్పారు.