ఒక్కసారి ఓటు వేసే ముందు ఆలోచించాలన్నారు మంత్రి కేటీఆర్. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎందుకు ఓటు వేయాలో ఆలోచించుకోవాలన్నారు. ఓటున్న ప్రతి ఒక్కరూ ఓటేసి… మంచి నాయకున్ని ఎన్నుకోవాలన్నారు. హైదరాబాద్ లో ఓటింగ్ శాతం పెరగాలన్నారు. సంస్కరణలు తీసుకొచ్చినపుడు మొదట్లో కొన్ని ఇబ్బందులుంటాయన్నారు. అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు.
లంచాలు లేకుండా పని జరిగేందుకు టీఎస్ తీసుకొచ్చామన్నారు. సామాన్యల కోసం ధరణి తీసుకొచ్చామన్నారు. రాష్ట్రంలో థర్మల్ ,సోలార్ పవర్ పెంచామన్నారు. హైదరాబాద్ లో తాగునీటి కొరత తీర్చామన్నారు. గతంలో జలమండలి ముందు బిందెలతో ఆందోళనలు జరిగేవన్నారు. హైదరాబాద్ లో 44 లక్షల చెత్త బుట్టలు ఇచ్చామన్నారు. స్వచ్ఛ సర్వేక్షణ్ లో హైదరాబాద్ ముందుందన్నారు. హైదరాబాద్ లో 90 చెత్త కలెక్షన్ సెంటర్లు ఏర్పాటు చేశామన్నారు.