
జనాభా ప్రతిపాదికన డీలిమిటేషన్ సమ్మతం కాదదన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.తమిళనాడులో సీఎం స్టాలిన్ ఆధ్వర్యంలో డీలిమిటేషన్ పై ఆల్ పార్టీ మీటింగ్ కు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. డీలిమిటేషన్ వల్ల దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు. దేశ సమాఖ్య స్ఫూర్తిని కాపాడాల్సిన అవసరం ఉందన్నారు. డీలిమిటేషన్ తో ఎన్నో నష్టాలు ఉన్నాయన్నారు. కేంద్రం బిగ్ బ్రదర్ లా ఉండాలి కానీ బిగ్ బాస్ లా ఉండకూడదన్నారు కేటీఆర్.
భారత జీడీపీకి దక్షిణాది రాష్ట్రాలే ఆయువు పట్టు అని చెప్పారు కేటీఆర్. ఇండియా అంటే యూనియన్ ఆఫ్ స్టేట్స్ అని రాజ్యాంగం చెబుతుందన్నారు. భారత ప్రజాస్వామ్యానికి బీఆర్ఎస్ కట్టుబడి ఉందని తెలిపారు. ఇప్పటికే కేంద్రం వివక్షతో దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర నష్టం జరిగిందని చెప్పారు.
ALSO READ | చెన్నైలో జరిగేది దొంగల ముఠా సమావేశం : కేంద్ర మంత్రి బండి సంచలన కామెంట్స్
తమిళనాడు ప్రజల నుంచి అనేక అంశాలను స్ఫూర్తిగా తీసుకుంటామన్నారు కేటీఆర్. అస్తిత్వం కోసం, హక్కుల కోసం కొట్లాడటంలో తమిళనాడు స్ఫూర్తి అని చెప్పారు. దక్షిణాది రాష్ట్రాలపై కేంద్ర వివక్ష కొత్త కాదన్నారు కేటీఆర్.