కొండా సురేఖపై పరువు నష్టం దావా కేసులో కేటీఆర్ స్టేట్ మెంట్ రికార్డ్ చేసింది నాంపల్లి కోర్టు. 30 నిముషాల పాటు స్టేట్ మెంట్ ఇచ్చారు కేటీఆర్. కొండా సురేఖ చేసిన వ్యాఖ్యల వీడియోలను కోర్టుకు అందించారు కేటీఆర్ . ఈ సందర్భంగా కేటీఆర్...కొండా సురేఖ తన పరువు తీసేలా మాట్లాడారని..ఆమెపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోరారు.
నాపై ఇటీవల మంత్రి కొండా సురేఖ ఎలాంటి ఆధారాలు లేకుండా మాట్లాడారు. ఒక మంత్రిగా ఉన్న ఒక మహిళ నాపై లేని పోనీ అసత్య ఆరోపణలు చేశారు. ఆమె చేసిన వ్యాఖ్యలు సమాజంలో తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. ఆమె చేసిన వ్యాఖ్యలు అనేక ప్రచార మధ్యమాల్లో ప్రచారం అయ్యాయి. నా పరువు ప్రతిష్టలు దెబ్బ తీసే విధంగా మాట్లాడారు. ఫోన్ ట్యాపింగ్ చేశానని వ్యాఖ్యలు చేశారు. ఆమె చేసిన అన్ని వ్యాఖ్యలు పూర్తిగా అవాస్తవం. నా పరువు ప్రతిష్ట దెబ్బ తీసే విధంగా మాట్లాడారు. గత 18 ఏళ్లుగా రాజకీయ జీవితంలో ఉన్న తనను తన మాటలతో తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు. నిరాధార ఆరోపణలు చేసిన మంత్రి కొండా సురేఖ ఫై క్రిమినల్ చర్యలు తీసుకోవాలి. రాజకీయ కక్ష్య సాధింపు చర్యలో భాగంగానే ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. నాపై సమాజంలో ఉన్న మంచి పేరు ప్రతిష్టలను దిగజార్చాలానే అలాంటి వాఖ్యలు చేశారు. అన్ని ఆధారాలను కోర్టుకు సమర్పించాను. యూట్యూబ్ లింక్స్, పేపర్ స్టేట్ మెంట్స్ అన్ని కోర్టుకు ఇచ్చాను. చట్ట ప్రకారం మంత్రిపై చర్యలు తీసుకోవాలి అని కేటీఆర్ తన వాంగ్మూలంలో తెలిపారు. ఈ కేసు తదుపరి విచారణ అక్టోబర్ 30 కి వాయిదా వేసింది కోర్టు.
ALSO READ | కొండా సురేఖపై నాగార్జున పరువు నష్టం దావా ఎపిసోడ్లో బిగ్ ట్విస్ట్