
హైదరాబాద్ : ZPTC, MPTC ఎన్నికలకు టీఆర్ఎస్ సిద్ధమవుతోంది. తెలంగాణ భవన్ లో ప్రధాన కార్యదర్శులతో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమావేశం అయ్యారు. పార్లమెంట్ ఎన్నికల్లో పోలింగ్ సరళిపై చర్చించారు. రాబోయే ZPTC, MPTC ఎన్నికలపై కేటీఆర్ పార్టీ నేతలతో చర్చించారు.
2018 డిసెంబర్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ జయభేరి మోగించింది. ఆ తర్వాత జరిగిన సర్పంచ్ ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ మెజారిటీ స్థానాలు గెల్చుకుంది. జిల్లా పరిషత్, మండల పరిషత్ ఎన్నికల్లోనూ గులాబీ జెండా రెపరెపలాడించాలని పార్టీ నాయకులకు సూచించారు కేటీఆర్. పార్టీ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను గ్రామగ్రామాన ప్రచారం చేయాలని .. అన్ని జిల్లాల్లోని టీఆర్ఎస్ నాయకత్వానికి తగిన సూచనలు ఇచ్చి పార్టీ గెలుపుకోసం కృషి చేయాలని ఆయన సూచించారు.