నేడు(జనవరి 16) ఈడీ విచారణకు కేటీఆర్

  • ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసిన అధికారులు
  • అగ్రిమెంట్లు, లావాదేవీలపై ప్రశ్నించే అవకాశం
  • అర్వింద్ కుమార్ ఇచ్చిన స్టేట్​మెంట్ ఆధారంగా విచారణ

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: ఫార్ములా- ఈ కార్​రేస్‌‌‌‌ కేసులో బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌ వర్కింగ్ ప్రెసిడెంట్‌‌‌‌ కేటీఆర్.. గురువారం ఈడీ విచారణకు హాజరుకానున్నారు. ఉదయం 10.30 గంటలకు బషీర్‌‌‌‌‌‌‌‌బాగ్‌‌‌‌లోని హైదరాబాద్‌‌‌‌ జోనల్‌‌‌‌ ఈడీ ఆఫీస్​కు రానున్నారు. ఈ మేరకు కేటీఆర్‌‌‌‌‌‌‌‌ను ప్రశ్నించేందుకు ఈడీ అధికారులు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. ప్రధానంగా ఫార్ములా ఈ ఆపరేషన్స్‌‌‌‌, ఏస్‌‌‌‌ నెక్స్ట్ జెన్‌‌‌‌ సహా సీజన్‌‌‌‌ 9లో పాల్గొన్న ప్రైవేట్ సంస్థల గురించి ఈడీ ఆరా తీయనున్నట్లు తెలిసింది. ఫార్ములా ఈ కార్ రేస్‌‌‌‌ ప్రపోజల్స్ దగ్గర్నుంచి విదేశీ సంస్థలకు చేరిన హెచ్‌‌‌‌ఎండీఏ బోర్డు నిధులపైనే కేటీఆర్‌‌‌‌‌‌‌‌ను ప్రశ్నించనున్నట్లు సమాచారం. 

కాగా, కేటీఆర్‌‌‌‌‌‌‌‌ ఈడీ విచారణకు హాజరవుతుండడంతో పోలీసులు అలర్ట్‌‌‌‌ అయ్యారు. జూబ్లీహిల్స్ నందినగర్‌‌‌‌‌‌‌‌లోని ఆయన నివాసం నుంచి బషీర్‌‌‌‌‌‌‌‌బాగ్‌‌‌‌లోని ఈడీ ఆఫీస్ దాకా భద్రతా ఏర్పాటు చేశారు. వెస్ట్‌‌‌‌ జోన్‌‌‌‌, సెంట్రల్‌‌‌‌ జోన్ డీసీపీల పర్యవేక్షణలో బందోబస్తు నిర్వహించనున్నారు.‌‌‌‌ కాగా, కేటీఆర్, అర్వింద్‌‌‌‌ కుమార్‌‌‌‌, బీఎల్‌‌‌‌ఎన్‌‌‌‌ రెడ్డిని మరోసారి విచారించేందుకు ఏసీబీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. విచారణ షెడ్యూల్‌‌‌‌ను శుక్రవారం వెల్లడించే అవకాశాలు ఉన్నాయి. 

కీలకంగా మారిన అర్వింద్ కుమార్ స్టేట్​మెంట్

ఫార్ములా ఈ ఆపరేషన్స్‌‌‌‌, ఎంఏయూడీ, ఏస్‌‌‌‌ నెక్స్ట్ జెన్‌‌‌‌ మధ్య జరిగిన ఒప్పందాలకు సంబంధించిన డాక్యుమెంట్లను ఈడీ అధికారులు ఇప్పటికే మార్క్‌‌‌‌ చేశారు. హిమాయత్‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌ ఇండియన్ ఓవర్సిస్‌‌‌‌ బ్యాంక్‌‌‌‌లోని హెచ్‌‌‌‌ఎండీఏ బోర్డు అకౌంట్స్‌‌‌‌ ట్రాన్సాక్షన్స్‌‌‌‌పైనే ఈడీ దృష్టి సారించింది. ప్రధానంగా బ్రిటన్‌‌‌‌లోని ఫార్ములా ఈ ఆపరేషన్స్‌‌‌‌తో జరిగిన ఒప్పందాలు, ఆయా కంపెనీలకు రాష్ట్ర ప్రభుత్వం చేసిన చెల్లింపులపై ఆధారాలు సేకరిస్తున్నది. కేటీఆర్‌‌‌‌‌‌‌‌ విచారణలో అర్వింద్‌‌‌‌ కుమార్‌‌‌‌‌‌‌‌ స్టేట్‌‌‌‌మెంట్‌‌‌‌ కీలకంగా మారినట్లు తెలిసింది. ఆయన సీఎస్‌‌‌‌కు రాసిన లెటర్‌‌‌‌‌‌‌‌తో పాటు హైకోర్టుకు ఇచ్చిన సమాచారం ఆధారంగా కేటీఆర్‌‌‌‌‌‌‌‌ను ప్రశ్నించే అవకాశాలున్నాయి. ముందుగా కేటీఆర్‌‌‌‌‌‌‌‌ ఇచ్చే సమాచారం అంతా రికార్డ్ చేసుకుని.. ఆ తర్వాత ఆయన్ను ప్రశ్నించనున్నట్లు తెలిసింది.

కీలకంగా మారిన అగ్రిమెంట్స్‌‌‌‌, ట్రాన్సాక్షన్స్‌‌‌‌

2023, ఫిబ్రవరిలో నిర్వహించిన ఫార్ములా ఈ కార్ రేస్‌‌‌‌ సీజన్‌‌‌‌ 9, 2024 ఫిబ్రవరి 10న నిర్వహించ తలపెట్టిన సీజన్‌‌‌‌ 10కి సంబంధించిన అక్రమాలు జరిగిన సంగతి తెలిసిందే. హెచ్‌‌‌‌ఎండీఏ బోర్డుకు చెందిన రూ.54.89 కోట్లు దుర్వినియోగం అయ్యాయని నిరుడు డిసెంబర్‌‌‌‌‌‌‌‌ 19న ఏసీబీ కేసు నమోదు చేసింది. అప్పటి మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్న కేటీఆర్‌‌‌‌‌‌‌‌ను ప్రధాన నిందితుడిగా, ఏ2గా మున్సిపల్‌‌‌‌ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్‌‌‌‌ డెవలప్‌‌‌‌మెంట్‌‌‌‌ (ఎంఏయూడీ) స్పెషల్‌‌‌‌ చీఫ్‌‌‌‌ సెక్రటరీ అర్వింద్‌‌‌‌కుమార్‌‌‌‌, ఏ3గా హెచ్‌‌‌‌ఎండీఏ మాజీ చీఫ్ ఇంజినీర్‌‌‌‌‌‌‌‌ బీఎల్‌‌‌‌ ఎన్‌‌‌‌రెడ్డిని చేర్చింది. ఏసీబీ ఎఫ్‌‌‌‌ఐఆర్‌‌‌‌‌‌‌‌ ఆ‌‌‌‌ధారంగా ఈడీ అధికారులు ఎన్‌‌‌‌ఫోర్స్‌‌‌‌మెంట్‌‌‌‌ కేస్‌‌‌‌ ఇన్‌‌‌‌ఫర్మేషన్ రిపోర్ట్‌‌‌‌(ఈసీwఐఆర్) నమోదు చేశారు. ఆర్బీఐ నిబంధనలకు విరుద్ధంగా ఫార్ములా ఈ ఆపరేషన్స్‌‌‌‌ సంస్థకు చేరిన రూ.45.71 కోట్లు సహా మొత్తం రూ.54.89 కోట్లకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలపై దర్యాప్తు ప్రారంభించింది.

విదేశాలకు వెళ్లిన డబ్బు ఎంత? 

ఫార్ములా ఈ ఆపరేషన్స్‌‌‌‌తో పాటు ఇంకా ఫారిన్ కంపెనీలకు జరిగిన చెల్లింపులపై ఈడీ దర్యాప్తు చేస్తున్నది. ఈ క్రమంలోనే హెచ్‌‌‌‌ఎండీఏ సహా ఎంఏయూడీ నుంచి పూర్తి రికార్డులు సేకరించింది. హెచ్‌‌‌‌ఎండీఏ బోర్డుకు చెందిన రూ.55 కోట్లలో రూ.45.71 కోట్లు బ్రిటన్‌‌‌‌కు తరలించడంతో పాటు ఇతర ఫారిన్ ట్రాన్సాక్షన్స్‌‌‌‌ వివరాలు సేకరిస్తున్నది. ఈ క్రమంలోనే మనీలాండరింగ్‌‌‌‌, ఫెమా యాక్ట్‌‌‌‌ కింద ఈసీఐఆర్‌‌‌‌‌‌‌‌ నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నది. బీఎల్‌‌‌‌ఎన్‌‌‌‌ రెడ్డిని 8న, ఐఏఎస్‌‌‌‌ అర్వింద్‌‌‌‌ కుమార్‌‌‌‌ను 9న ఈడీ అధికారులు విచారించి స్టేట్​మెంట్ రికార్డ్ చేశారు.