
- ఆలయాల సందర్శన.. హనుమాన్ భక్తులతో భోజనం
రాజన్నసిరిసిల్ల, వెలుగు: రాజన్నసిరిసిల్ల జిల్లాలో కేటీఆర్ బుధవారం విస్తృతంగా పర్యటించారు. బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో తెలంగాణ భవన్‌లో హనుమాన్ మాలధారులతో కలిసి కలిసి భిక్ష(భోజనం) చేశారు. మధ్యాహ్నం గంభీరావుపేట మండలకేంద్రంలోని పెద్దమ్మతల్లి ఆలయాన్ని సందర్శించారు. అనంతరం కోనరావుపేట మండలం మల్కపేట గ్రామంలో సీతారామచంద్రస్వామి వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించిన బ్రహోత్సవాల్లో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయన వెంట పార్టీ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, లీడర్లు జిందం
చక్రపాణి, బొల్లి రామ్మోహన్, చల్మెడ లక్ష్మీనర్సింహారావు, అరుణ, తిరుపతి, చంద్రయ్య ఉన్నారు.