అన్ని జిల్లాల పార్టీ కార్యాలయాల్లో సంపత్‌రెడ్డికి నివాళులు అర్పిస్తాం: కేటీఆర్

అన్ని జిల్లాల పార్టీ కార్యాలయాల్లో సంపత్‌రెడ్డికి నివాళులు అర్పిస్తాం: కేటీఆర్

రాష్ట్రంలోని  అన్ని జిల్లాల పార్టీ కార్యాలయాల్లో జనగామ జెడ్పీ ఛైర్మన్‌ పాగాల సంపత్‌రెడ్డికి నివాళులు అర్పిస్తామని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్  కేటీఆర్ అన్నారు. జనగామ జిల్లా  చిల్పూర్ మండలం రాజవరం గ్రామానికి కేటీఆర్ వెళ్లి..  సంపత్ రెడ్డి మృతదేహానికి నివాళులు అర్పించారు. కేటీఆర్ వెంట బీఆర్ఎస్ నూతన ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, పల్లా రాజేశ్వర్ రెడ్డిలు ఉన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్.. సంపత్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. వారికి అండగా ఉంటామని కేటీఆర్ భరోసా ఇచ్చారు. 

అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ..  పాగాల సంపత్ రెడ్డి గుండెపోటుతో మృతి చెందడం బాధాకరమన్నారు. బీఆర్ఎస్ వ్యవస్థాపక సభ్యుల్లో సంపత్ రెడ్డి ఒకరని.. తెలంగాణ ఉద్యమంలో కూడా సంపత్ రెడ్డి  కీలక పాత్ర పోషించారని చెప్పారు.  జనగామ జిల్లాలో సంపత్ రెడ్డి లేని లోటు తీర్చలేనిదన్నారు. వారి కుటుంబానికి అండగా ఉంటామని కేటీఆర్ తెలిపారు.  

డిసెంబర్ 4వ తేదీ సోమవారం సాయంత్రం పాగాల సంపత్‌రెడ్డి గుండెపోటుతో కన్నుమూశారు. హనుమకొండలోని తన నివాసం ఉన్న ఆయనకు గుండెపోటు రావడంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయారు.  కుటుంబ సభ్యులు వెంటనే ఆయన్ని హనుమకొండలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. 

Also read :- కాంగ్రెస్ సీఎం అభ్యర్థి ఎంపిక ఖరారు.. సాయంత్రం పేరు వెల్లడించే చాన్స్