హైదరాబాద్, వెలుగు: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కొన్నాళ్లపాటు రాజకీయాలకు బ్రేక్ ఇస్తున్నట్లు ప్రకటించారు. వెకేషన్కు వెళ్తున్నట్లు శనివారం ట్వీట్ చేశారు. ‘‘కొన్నాళ్లు ప్రశాంతంగా, ఆనందంగా ఉండేందుకు వెకేషన్కు వెళ్తున్న. నా రాజకీయ ప్రత్యర్థులు నన్ను తలచుకోకుండా, మిస్ అవకుండా ఉండరనుకుంటున్న’’ అని అందులో పేర్కొన్నారు.
కాగా, పదిహేనేండ్ల కింద ఇదే రోజు ఉద్యమంలో పాల్గొన్న తనను పోలీసులు అరెస్ట్ చేసి వరంగల్ సెంట్రల్ జైలులో పడేశారని.. అప్పటి ఫొటోను ఆయన షేర్ చేశారు. తన జీవితాంతం దాన్ని మరచిపోనని, గౌరవంగా భావిస్తానని తెలిపారు.