ఉప్పల్లో చరిత్ర సృష్టించిన సన్రైజర్స్ .. కేటీఆర్ ట్వీట్

  ఉప్పల్లో చరిత్ర సృష్టించిన సన్రైజర్స్ ..  కేటీఆర్ ట్వీట్

హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో సిక్సులు, ఫోర్ల వర్షం కురిసింది.. సన్ రైజర్స్ ప్లేయర్లు ముంబై బౌలర్లపై విరుచుకుపడ్డారు. బౌలర్‌ ఎవరని చూడకుండా సిక్సులు, ఫోర్లు బాదుతూ ప్రేక్షకులను అలరించారు.  దీంతో ఐపీఎల్ లో  సన్ రైజర్స్ టీమ్ చరిత్ర సృష్టించింది.  టోర్నీ చరిత్రలోనే అత్యధికంగా 277 పరుగులు చేసింది. అంతకుముందు ఈ రికార్డు బెంగళూరు (263)పై ఉంది. 2013లో పుణెపై ఈ స్కోర్‌ని నమోదు చేసింది.

ఉప్పల్ స్టేడియంలో సన్ రైజర్స్ ప్లేయర్ల ఆట తీరుపై  మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్వీట్  చేశారు.  ఈరోజు సన్ రైజర్స్ బ్యాట్స్‌మెన్ పవర్ హిట్టింగ్ తో అద్భుతమైన ప్రదర్శన కనబరిచి ఐపీఎల్ లో సరికొత్త రికార్డు సృష్టించారు.  టేక్ అ బో అబ్బాయిలు హైదరాబాద్‌ ప్రేక్షకులను అలరించినందుకు ధన్యవాదాలు అంటూ కేటీఆర్ ఎక్స్ లో పోస్ట్ చేశారు.  

ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ చరిత్ర సృష్టించింది. ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో తొలి 10 ఓవర్లలోనే 148/2 పరుగులు చేసింది. దీంతో ఐపీఎల్ చరిత్రలోనే తొలి 10 ఓవర్లలో 148 పరుగులు బాదిన తొలి జట్టుగా హైదరాబాద్ నిలిచింది. ఆ తర్వాత ముంబై 131/3 (2021), పంజాబ్ 131/3 (2014), డెక్కన్ ఛార్జర్స్ 130/0 (2008), బెంగళూరు 129/0 (2016), బెంగళూరు 128/0 (2013), లక్నో 128/2 (2023), చెన్నై 128/2 (2015) ఉన్నాయి.