- బండి వ్యాఖ్యలు కోర్టు ధిక్కారమేనని ట్వీట్
బెయిల్ ఇచ్చినందుకు సుప్రీం కోర్టుకు కృతజ్ఞతలు తెలుపుతూ మంగళవారం కేటీఆర్ ట్వీట్ చేశా రు. ఉపశమనం కలిగిందని, న్యాయం గెలిచింద ని పేర్కొన్నారు. అలాగే, కవితకు బెయిల్‌పై బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించా రు. కేంద్ర మంత్రి స్థాయిలో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. కవితకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయటం కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల విజయమంటూ బండి సంజయ్ ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు.
కాంగ్రెస్ లాయర్లు చేసిన కృషితో ఒకరికి బెయిల్ వస్తే.. బీఆర్ఎస్ సపోర్ట్ కారణంగా ఆ లాయర్ రాజ్యసభలో స్థానం పొందారని ఆయన పోస్ట్‌లో పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలను ఖండించిన కేటీఆర్, కేంద్రమంత్రిగా ఉంటూ ఇంత చౌకబారుగా మాట్లాడతారా అని విమర్శించారు. ఇలా దురుద్దేశపూర్వకంగా సంజయ్ చేసిన వ్యాఖ్యలను కోర్టు ధిక్కారంగా పరిగణించాని కోర్టుకు ఆయన విజ్ఞప్తి చేశారు.