కేటీఆర్ యూ టర్న్..! తెలంగాణకే పరిమితమవుతామని చెప్పకనే చెప్పారా..?

కేటీఆర్ యూ టర్న్..! తెలంగాణకే పరిమితమవుతామని చెప్పకనే చెప్పారా..?

హైదరాబాద్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రాంతీయ రాగం అందుకున్నారు. 2029లో బలమైన ప్రాంతీయ పార్టీలదే హవా ఉండబోతోందని, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు మేజిక్ ఫిగర్ రాదని ట్విట్టర్ వేదికగా చేసిన కామెంట్ బీఆర్ఎస్ యూటర్న్‎కు సంకేతమా..? అనే అనుమానాలు కలిగిస్తోంది. నిన్న హర్యానా, జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాపై కేటీఆర్ ట్వీట్ చేశారు. రాష్ట్ర ఏర్పాటే ఎజెండాగా తెలంగాణ రాష్ట్ర సమితిగా 2001లో ఆవిర్భవించింది. స్వరాష్ట్రం సిద్ధించిన తర్వాత 2014లో తొలి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. 2018లో ముందస్తు ఎన్నికలకు వెళ్లి మరో మారు అధికారంలోకి వచ్చింది. 

ALSO READ | BC Caste Census: 60 రోజుల్లోగా బీసీ కులగణన: సీఎం రేవంత్ ఆదేశాలు

ఆ తర్వాత జాతీయ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వాలని భావించిన గులాబీ బాస్ కేసీఆర్ టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చారు. పొరుగు రాష్ట్రాలపై ప్రధానంగా ఫోకస్ చేశారు. మహారాష్ట్రలో ఏకంగా పార్టీ ఆఫీసునే ప్రారంభించారు. తన అన్న కుమారుడు కల్వకుంట్ల వంశీధర్ రావును ఆ రాష్ట్ర కన్వీనర్ గా నియమించారు. బీఆర్ఎస్ గా మార్చుతూ నిర్వహించిన కార్యక్రమానికి జేడీఎస్ అధినేత కుమార స్వామిని ఆహ్వానించారు. కర్నాటక ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటీ చేస్తుందనే ప్రచారం దాకా వెళ్లింది.. కానీ  సీన్ రివర్స్.. కర్నాటకలో జేడీఎస్ తో ఎలాంటి అవగాహనకూ రాలేదు.. ఆ రాష్ట్రంలో ఒక్కటంటే ఒక్క సీట్లో కూడా పోటీ చేయలేదు. 

ALSO READ | ఈ రాష్ట్రం మీది.. మీ కోసమే మేమున్నాం: డిప్యూటి సీఎం భట్టి

పార్టీని విస్తరించలేదు కూడా..! ఒడిశాలో మాజీ ముఖ్యమంత్రి గిరిధర్ గమాంగ్ ను పార్టీలో చేర్చుకున్నారు. అక్కడ పార్టీని విస్తరిస్తారని అంతా భావించినా అదీ జరగలేదు. ఆంధ్రప్రదేశ్ లోనూ బీఆర్ఎస్ విస్తరణకు ఏర్పాట్లు చేశారు. తోట చంద్రశేఖర్ ను రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించారు. ఏపీలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తారని ప్రచారం జరిగినా కేసీఆర్ ఏపీలోకి ఎంట్రీ ఇవ్వలేదు. అక్కడి అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయలేదు. మహారాష్ట్రలో బీఆర్ఎస్ బాగానే హడావుడి చేసింది. సాక్షాత్తూ గులాబీ బాస్ కేసీఆర్ మహారాష్ట్రపై దృష్టి సారించారు. ముఖ్యంగా తెలంగాణ  ప్రజలు నివసించే ప్రాంతాలపై దృష్టి సారించారు.

ALSO READ | నామోషీగా ఫీలవుతున్నారు.. మొత్తం మార్చేస్తాం: సీఎం రేవంత్ రెడ్డి

 నాగ్ పూర్‎లో ఏకంగా బీఆర్ఎస్ కార్యాలయాన్నే ఓపెన్ చేశారు. భారీ బహిరంగ సభలు నిర్వహించి అబ్ కీ బార్ కిసాన్  సర్కార్ అనే నినాదంతో మరాఠాలను మురిపించారు. తెలంగాణలో ఓటమి చెందిన తర్వాత క్రమంగా చాపచుట్టేశారు. దీంతో అక్కడి నాయకులు కేసీఆర్ వద్దకు వచ్చారు. ఆఫీసు బేరర్లకు జీతాలు లేవని, ఆఫీసు బిల్డింగులకు కిరాయిలు కట్టలేకపోతున్నామని గోడు వెళ్లబోసుకునేందుకు రెడీ అయ్యారు. హైదరాబాద్ వచ్చినా కేసీఆర్ అపాయింట్ మెంట్ దొరకలేదు.

ALSO READ |జమిలి ఎన్నికలు పెడితే నష్టమేంటి ? : సీఎం చంద్రబాబు

 దీంతో అక్కడి రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు సహా అంతా ఎన్సీపీలో చేరిపోయారు. దీంతో దర్వాజాలు మూసుకుపోవడంతోనే కేటీఆర్ ప్రాంతీయ రాగం అందుకున్నారా..? అన్నది హాట్ టాపిక్‎గా మారింది. తెలంగాణలో ఓటమి తర్వాత బీఆర్ఎస్‎ను టీఆర్ఎస్ గా మార్చాలనే వాదన బలంగా వినిపిస్తోంది. మాజీ ఎంపీ వినోద్ కుమార్, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తదితరులు ఈ విషయాన్ని బహిరంగంగానే చెప్పారు.

ALSO READ | ఆనాడే చెప్పా: తండ్రి, కొడుకుల కొలువులు ఊడగొడ్తే.. మీకు ఉద్యోగాలు

 హరీశ్ రావు సైతం పటాన్ చెరులో జరిగిన సమావేశంలో టీఆర్ఎస్ కండువా కప్పుకొని కనిపించడంతో బీఆర్ఎస్ పేరు మార్పు దాదాపుగా ఖరారైందనే చర్చకు వచ్చింది. ఆ తర్వాత చర్చ పక్కదారి పట్టింది. 2029లో కేంద్రంలో బలమైన ప్రాంతీయ పార్టీల హవా ఉండబోతోందని పేర్కొనడంతో బీఆర్ఎస్.. టీఆర్ఓస్ గా మారబోతోందా..? అన్న అంశం మరోమారు తెరపైకి వచ్చింది.