మాజీ ఎమ్మెల్యేకు కేటీఆర్​ పరామర్శ 

సైదాపూర్, వెలుగు: చొప్పదండి మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభను బీఆర్ఎస్ ​వర్కింగ్​ప్రెసిడెంట్​ కేటీఆర్​ బుధవారం పరామర్శించారు. సైదాపూర్ మండలం వేంకటేశ్వర్ల పల్లిలోని ఆమె స్వగ్రామంలో కేటీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తోపాటు మాజీ మంత్రి గంగుల కమలాకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, మాజీ ఎంపీ వినోద్ కుమార్, మాజీ ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్, సుంకె రవిశంకర్, వొడితల సతీశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కుమార్​ తదితరులు పరామర్శించారు.  

కేటీఆర్ మాట్లాడుతూ గాలన్న అనేక పోరాటాల్లో పాల్గొన్నారని, తెలంగాణ ఉద్యమంలో ఆయన పాత్ర కీలకమన్నారు. కుటుంబ సభ్యులకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు.