బీజేపీ తెలంగాణ చీఫ్ బండి సంజయ్, మంత్రి కేటీఆర్ మధ్య ట్విట్టర్ వార్ కొనసాగుతోంది. సీఎం కేసీఆర్ ఫ్యామిలీని ఉద్దేశించి బండి సంజయ్ చేసిన ఆరోపణలకు మంత్రి కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు.
ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం హామీలను మోడీ ప్రభుత్వం దారుణంగా ఉల్లంఘించిందని కేటీఆర్ ట్వీట్టర్లో విమర్శించారు. దీనికి వెన్నెముక లేని తెలంగాణ బీజేపీ ఎంపీలు బాధ్యత వహించాలన్నారు. తెలంగాణకు కోచ్ ఫ్యాక్టరీ నిరాకరించిన ప్రధాని మోడీ సొంత రాష్ట్రం గుజరాత్‌కు రూ. 20 వేల కోట్ల లోకోమోటివ్ కోచ్ ఫ్యాక్టరీ కేటాయించారని విమర్శించారు. గుజరాతీ బాస్‌ల చెప్పులు మోసే దౌర్బాగ్యులను ఎన్నుకున్న ఫలితంగా తెలంగాణకు ఈ దుస్థితి నెలకొందన్నారు.
తెలంగాణకు కోచ్ ఫ్యాక్టరీ, పసుపు బోర్డు, మెట్రో రెండో దశ, ఐటిఐఆర్ ప్రాజెక్టు, గిరిజన యూనివర్సిటీ, బయ్యారం ఉక్కుఫ్యాక్టరీ, ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చేది లేదని మోడీ చెప్పారని.. మోడీ ప్రాధాన్యతలో తెలంగాణ లేనప్పుడు.. తెలంగాణ ప్రాధాన్యతలో మోడీ ఎందుకని కేటీఆర్ ప్రశ్నించారు. తెలంగాణలో ఆ దిక్కుమాలిన పార్టీ ఎందుకుండాలని ప్రశ్నించారు.
https://twitter.com/KTRBRS/status/1641387055174529024
అంతకు ముందు కేసీఆర్ ఫ్యామిలీ టార్గెట్ గా బండి సంజయ్ ట్విట్టర్లో ఆరోపణలు చేశారు. దేశంలోనే అత్యధికంగా నెలకు రూ.4.1లక్షల జీతం తీసుకుంటున్న సీఎం కేసీఆర్ అని విమర్శించారు. కేటీఆర్ ఇమేజ్ కాస్ట్ 100 కోట్లయితే.. కవిత ధరించిన వాచ్ విలువ 20 లక్షలయితే.. అత్యాచారం, ర్యాగింగ్, వీధి కుక్కల దాడిలో చనిపోయిన పిల్లలు, టీఎస్ పీఎస్ సీ పేపర్ లీకేజీ బాధితుల విలువ ఎంత? అని బండి సంజయ్ ప్రశ్నించారు. దొరగారి గడుల్లో నలిగిపోయిన న్యాయమా? అని బండి సంజయ్ ట్వీట్ చేశారు.
https://twitter.com/bandisanjay_bjp/status/1641350719579234304