ఇదే లాస్ట్ వార్నింగ్..కేసీఆర్ ను దూషిస్తే ఊరుకోం

రెచ్చగొట్టడం వల్లే విద్యార్థి సునీల్ చనిపోయాడన్నారు మంత్రి కేటీఆర్.వరంగల్ లో మీడియాతో మాట్లాడిన కేటీఆర్.. IAS కావాల్సిన వాడినని సునీల్  వీడియోలో చెప్పాడన్నారు. IAS నోటిఫికేషన్ల భర్తీ ఎవరిదని ఆయన ప్రశ్నించారు. ప్రధాని మోడీ ఎన్ని ఉద్యోగాలిచ్చారో చెప్పాలన్నారు. ఉద్యోగాల పేరుతో ప్రతిపక్షాలు సిగ్గులేకుండా మాట్లాడుతున్నాయన్నారు. లక్షా 32వేల ఉద్యోగాలిచ్చామని క్లారిటీ ఇచ్చినా.. చిల్లర రాజకీయాలు చేస్తున్నాయన్నారు. ఉద్యమంలో బండి సంజయ్, ఉత్తమ్ ఎక్కడున్నారని ప్రశ్నించారు.  త్వరలో 50 వేల ఉద్యోగాలకు ప్రకటన చేస్తామన్నారు. కేసీఆర్ ను దూషిస్తే ఊరుకునే ప్రసక్తే లేదని..ఇదే చివరిసారన్నారు.