- పండుగపూట మహిళలు, మహిళా మంత్రులను అవమానించడం ఫ్యాషన్ అయింది: మంత్రి సీతక్క
- మేం సమ్మక్క-సారలమ్మ, రాణి రుద్రమ గడ్డ నుంచి వచ్చినం
- కేటీఆర్.. చాటుగా కాదు, ధైర్యముంటే ముందుకు రా
- రాహుల్ గాంధీని విమర్శించే స్థాయా నీది అని ఫైర్
హైదరాబాద్, వెలుగు: పండుగపూట మహిళలను అవమానిస్తున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్నోటిని యాసిడ్‌తో కడగాలని మంత్రి సీతక్క మండిపడ్డారు. రాఖీ పండుగ రోజు బస్సుల్లో మహిళలు బ్రేక్ డాన్సులు చేసుకోవచ్చని కామెంట్ చేశారని, బతుక మ్మ మొదటి రోజునే చిట్‌చాట్ పేరుతో మహిళలు, మహిళా మంత్రులను కించపరిచారన్నారు. పండుగ ల పూట మహిళలు, మహిళా మంత్రులను కించపరచ డం కేటీఆర్‌కు ఫ్యాషన్ అయిందని ఫైర్అయ్యారు. బుధ వారం సీతక్క మీడియాతో మాట్లాడారు.
తెలంగాణ ఆడ బిడ్డల పండుగ బతుకమ్మ మొదటి రోజే మహిళలు, మహిళా మంత్రులను కించపరిచి, కేటీఆర్ తన నైజం చాటుకున్నారని అన్నారు. ఎంగిలి పూల బతుకమ్మ రోజే కేటీఆర్ గలీజ్ మాటలు వినాల్సి రావడం దురదృష్టకరమని, తమ నోళ్లను ఫినాయిల్‌తో కడగాలని మాట్లాడిన కుసంస్కారి కేటీఆర్ అని ఆగ్రహం వ్యక్తంచేశారు. తమ గురించి చాలా చులకనగా మాట్లాతున్నారన్న విషయం మీడియా ముఖంగా చెప్పి ఉంటే కేటీఆర్‌కు మహిళలే బుద్ధి చెప్పేవారని అన్నారు. మహిళా మంత్రు లను పదేపదే కించపరుస్తూ తన దొర దురహంకారాన్ని చాటుకుంటున్నాడని మండిపడ్డారు. చాటుగా నాలు గు గోడల మధ్య మాట్లాడటం కాదు.. ధైర్యముంటే ముందుకొచ్చి బహిరంగంగా మాట్లాడాలని కేటీఆర్‌కు సీతక్క సవాల్ చేశారు. ‘‘నేనెప్పుడూ వ్యక్తిగతంగా ఎవరినీ దూషించలేదు. దూషణలకు, బూతులకు బ్రాండ్ అంబాసిడర్ మీరే. మిమ్మల్ని వ్యక్తిగతంగా దూషించినట్టు ఆధారాలు చూపిస్తావా?” అని కేటీఆర్‌ను నిలదీశారు. సొంత సోషల్ మీడియాను కట్టడి చేయాలన్న సభ్యత కేటీఆర్ కు లేదని అన్నారు.
మా బాధ, ఆవేదన వారికి తగులుతుంది..
‘‘పండగపూట కూడా మా వెంటపడి అనవసరంగా తప్పుడు కూతలు కూసే కేటీఆర్.. మీ కుటుంబం, మీ ఇంట్లో కూడా ఆడవాళ్లు ఉన్నారన్న విషయం మరిచిపోవద్దు. మా బాధ, ఆవేదన మీ కుటుంబ సభ్యులకు తగులుతుంది” అని సీతక్క ఫైర్ అయ్యారు. ‘‘రాహుల్ గాంధీ కుటుంబం త్యాగం, కష్టం, నిజాయతీ ముందు మీరెంత? రాహుల్ గాంధీని విమర్శించేస్థాయి కేటీఆర్ కు లేదు” అని అన్నారు. తాము బీసీ, ఎస్టీ మంత్రులుగా ఆర్థిక నేపథ్యంతో కాకుండా.. స్వతంత్రంగా ఎదిగామని, సమ్మక్క – సారలమ్మ, రాణి రుద్రమ్మ గడ్డ నుంచి వచ్చామని తెలిపారు. తమ మీద ఎందుకంత అక్కసు అని అడిగారు. వరదల్లో మునిగి ప్రజలు నష్టపోవద్దని ప్రభుత్వం మూసీ ప్రక్షాళన చేపట్టిందని అన్నారు.
ప్రజలే స్వచ్ఛందంగా ఇండ్లు కూల్చుకుంటున్నారని, మూసీ కూల్చివేతల అంశంలో పేదలకు నష్టం రాకుండా ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు. ప్రజల ఇండ్లను కూలగొట్టి బుల్డోజర్ ప్రభుత్వం నడిపింది బీఆర్ఎస్సేనని అన్నారు. తమను అసభ్యకరంగా దూషించి శిఖండి అని ఎట్లా అంటారని నిలదీశారు. గత ప్రభుత్వంలో మహిళా మంత్రుల చరిత్ర.. ఇప్పటి మహిళా మంత్రుల చరిత్ర ప్రజలకు తెలుసనని, తాము నామినేట్ చేస్తే అప్పనంగా వచ్చినోళ్లం కాదని, ప్రజలు ఎన్నుకున్న మంత్రులమని అన్నారు. ‘‘పనిగట్టుకొని మేం సినిమావాళ్ల గురించి మాట్లాడలేదు. ఎవరి వ్యక్తిగత జీవితం వాళ్లకు ఉంటుంది. సినీ నటులకు మేం వ్యతిరేకం కాదు. వాళ్లను ద్వేషించడం లేదు”అని పేర్కొన్నారు.