హైదరాబాద్: ఐటీశాఖ మంత్రి కేటీఆర్ పుట్టిన రోజు సందర్భంగా భారీ ఎత్తున టెకీలు రక్తదానం చేశారు. సోమవారం మాదాపూర్ లోని రాయదుర్గం ఎన్ ఎస్ ఎల్ ఐటీ పార్కులో నిర్వహించిన రక్తదానం శిబిరంలో 1000 మంది ఐటీ ఉద్యోగులు బ్లడ్ డునేట్ చేశారు. తెలంగాణ ఫెసిలిటీస్ మేనేజ్ మెంట్ ఆధ్వర్యంలో ఉదయం 11 గంటలనుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.
నగరంలోని ఐటీ టవర్లలో సుమారు 10వేల మంది ఐటీ ఉద్యోగులు పనిచేస్తున్నారని వీరిలో 1000 మంది టెకీలు రక్తదానం చేస్తారని TMFC అధ్యక్షుడు సత్యనారాయణ మఠాల, డిప్యూటీ సీఆర్‌వో (ఐటీ) శ్రీనివాస్‌రావు తాండ్ర తెలిపారు. రెడ్ క్రాస్ సొసైటీ సహకారంతో గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమం పేరుతో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఐదుగురు డాక్టర్లు, 40 మంది నర్సింగ్ సిబ్బందితో మద్దతుగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారని TMFC అధ్యక్షుడు సత్యనారాయణ తెలిపారు.