హైదరాబాద్: దీపావళి పండుగకు ముందే తెలంగాణ పాలిటిక్స్‌లో రెండు మూడు పొలిటికల్ బాంబులు పేలబోతున్నాయంటూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. శుక్రవారం (అక్టోబర్ 25) ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పొంగులేటి బాంబులు తుస్సేనని ఎద్దేవా చేశారు. ఒరిజినల్ బాంబులకే భయపడలేదని.. ఈ ఉత్తుత్తి బాంబులు మమ్మల్ని ఏం చేయలేవన్నారు. వైఎస్సాఆర్, చంద్రబాబు లాంటి నేతలతోనే పోరాటం చేశామని.. ఇప్పుడు మీరెంత అని అన్నారు. ఏమైనా చిల్లర కేసులు పెట్టి జైలు పంపితే పంపుకోండి.. జైలుకెళ్లేందుకు సిద్ధమని ప్రకటించారు.
ALSO READ | దీపావళిలోపే స్కాముల బాంబు పేలుతది : పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి
మేం అధికారంలోకి వచ్చాక అందరి లెక్కలు తేలుస్తామని వార్నింగ్ ఇచ్చారు. కాగా, సియోల్ పర్యటనలో ఉన్న మంత్రి పొంగులేటి.. దీపావళికి ముందే తెలంగాణ పాలిటిక్స్‌లో బిగ్ బాంబులు పేలబోతున్నాయని.. గత ప్రభుత్వంలోని రెండు మూడు పెద్ద తలకాయాలపై చర్యలు తీసుకోబోతున్నామని.. ఇందుకు సంబంధించిన ఫైళ్లు అన్ని సిద్ధమయ్యాయని సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. పొంగులేటి కామెంట్స్ తెలంగాణ పాలిటిక్స్‌ను ఒక్కసారిగా వేడెక్కించాయి. ఏ బీఆర్ఎస్ నేతలపై ప్రభుత్వం యాక్షన్ తీసుకోబోతుందనే దానిపైన తీవ్ర ఉత్కంఠ నెలకొంది.