పార్టీ ఫిరాయింపులపై సుప్రీం కోర్టులో కేటీఆర్ పిటీషన్.. ఫిబ్రవరి 10న విచారణ

పార్టీ ఫిరాయింపులపై సుప్రీం కోర్టులో కేటీఆర్ పిటీషన్.. ఫిబ్రవరి 10న విచారణ

పార్టీ ఫిరాయింపుల వ్యవహారంపై సుప్రీం కోర్టును ఆశ్రయించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్.  పార్టీ మారిన 7గురు ఎమ్మెల్యేలను అనర్హలుగా ప్రకటించాలని సుప్రీంకోర్టులో పిటీషన్ వేశారు. కేటీఆర్ దాఖలు చేసిన పిటీషన్ పై జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ వినోద్ చంద్రన్ ల ధర్మాసనం విచారణ జరిపింది. కేటీఆర్ పిటీషన్ ను ఇదే వ్యవహారం పై గతంలో దాఖలైన పిటిషన్ కు జత చేసింది ధర్మాసనం. 

కేటీఆర్ పిటీషన్ ను విచారించిన ధర్మాసనం ఫిబ్రవరి 10న పాత పిటిషన్ తో కలిపి విచారణ చేస్తామని పేర్కొంది. ఈ పిటీషన్ ను అంతకు ముందే ఫైల్ అయిన దానం నాగేందర్ , కడియం శ్రీహరి, తెల్ల వెంకట్రావుల అనర్హత పిటిషన్లతో కలిపి  విచారిస్తామని స్పష్టం చేసింది సుప్రీం కోర్టు ధర్మాసనం. 


అదే సమయంలో ఏడుగురు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలన్న పిటిషన్లను.. ప్రతివాదులైన తెలంగాణ స్పీకర్ తరపు న్యాయవాది ముకుల్ రోహిత్గి కి అందజేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను ఫిబ్రవరి 10కి వాయిదా వేసింది.

ALSO READ : తెలంగాణలో 8 మంది బీజేపీ ఎంపీలున్నా..రాష్ట్రానికి తెచ్చిందేమీ లేదు : ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి

పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై గత విచారణలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది సుప్రీంకోర్టు. విచారణలో భాగంగా అనర్హత పిటిషన్లపై నిర్ణయానికి తగిన సమయం అంటే ఎంతో చెప్పాలని, మహారాష్ట్ర స్పీకర్ వ్యవహరించినట్లుగా తగిన సమయం అంటే పదవీ కాలం పూర్తయ్యే వరకా..? అని ప్రశ్నించింది. ప్రస్తుత కేటీఆర్ పిటీషన్ ను గత పిటీషన్ తో కలిపి ఫిబ్రవరి 10న విచారించనుంది. 

టిఆర్ఎస్ పార్టీ బీఫామ్ పై గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన  శ్రీనివాస్ రెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, కాలే యాదయ్య, టి ప్రకాష్ గౌడ్, అరికపూడి గాంధీ, గూడెం మహిపాల్ రెడ్డి, ఎం సంజయ్ కుమార్ ల అనర్హత పిటీషన్ పై  ఇప్పటివరకు స్పీకర్ ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని సుప్రీంకోర్టులో గతంలో బీఆర్ఎస్ పిటిషన్ వేసిన విషయం తెలిసిందే.