ఈ ఫార్ములా రేస్ కేసులో ఈడీ నోటీసులకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రిప్లై ఇచ్చారు. హైకోర్టు తీర్పు రిజర్వ్ లో ఉన్నందున విచారణకు సమయం కావాలని కోరారు. జనవరి 7న కేటీఆర్ ఈడీ విచారణకు హాజరుకావాల్సి ఉంది. కోర్టు తీర్పు వచ్చే వరకు సమయం కావాలని ఈడీకి మెయిల్ చేశారు.
మరో వైపు ఈ ఫార్ములా రేస్ కేసులో కేటీఆర్ క్వాష్ పిటిషన్ పై జనవరి 7న ఉదయం 10.30 గంటలకు హైకోర్టు తీర్పు ఇవ్వనుంది. ఏసీబీ కేసు కొట్టి వేయాలన్న కేటీఆర్ పిటిషన్ పై ఇటీవల వాదనలు ముగిసాయి. ఇరు వర్గాల వాదనలు విన్న కోర్టు తీర్పును రిజర్వ్ లో పెట్టింది. తదుపరి జడ్జిమెంట్ వచ్చే వరకు కేటీఆర్‌ను అరెస్ట్ చేయకుండా విచారణ చేసుకోవచ్చని తెలిపింది.
ALSO READ | వెనక్కి తగ్గని ఏసీబీ.. కేటీఆర్‌కు మరోసారి నోటీసులు
ఈ ఫార్ములా రేస్ కేసులో ఏ1గా ఉన్న కేటీఆర్ కు ఏసీబీ జనవరి 6న మరోసారి నోటీసులిచ్చింది. తాజాగా జారీ చేసిన నోటీసుల్లో జనవరి 9వ తేదీన విచారణకు రావాలని ఏసీబీ ఆదేశించింది. ఈ కేసులో కేటీఆర్ సోమవారమే (జనవరి 6) ఏసీబీ విచారణకు హాజరు కావాల్సి ఉండగా.. ఆయన విచారణకు హాజరు కాలేదు. ఏసీబీ అధికారుల ముందు హాజరయ్యేందుకు సోమవారం ఉదయం ఏసీబీ ఆఫీస్ వరకు వచ్చిన కేటీఆర్.. తనతో తన లాయర్లను అనుమతించకపోవడంతో విచారణకు హాజరు కాకుండానే తిరిగి వెళ్లిపోయాడు. దీంతో మరోసారి ఏసీబీ కేటీఆర్‌కు నోటీసులు జారీ చేసింది. మరీ నెక్ట్స్ టైమ్ అయిన కేటీఆర్ విచారణకు హాజరవుతారో లేదా చూడాలి.