ఓల్డ్ పెన్షన్​ బెనిఫిట్స్ కు పొందేందుకు కేయూ ప్రొఫెసర్ల పైరవీలు!

ఓల్డ్ పెన్షన్​ బెనిఫిట్స్ కు పొందేందుకు కేయూ ప్రొఫెసర్ల పైరవీలు!
  • ఈసీ రూల్స్​కు విరుద్ధంగా చేస్తున్నారనే ఆరోపణలు
  • నలుగురు ప్రొఫెసర్లపై  ఇన్​చార్జ్​ వీసీకి ఫిర్యాదులు

హనుమకొండ, వెలుగు:  కేయూలో నలుగురు ప్రొఫెసర్లకు ఓల్డ్​పెన్షన్​బెనిఫిట్స్​కట్టబెట్టేందుకు కొందరు వర్సిటీ ఉన్నతాధికారులు తెరవెనక చక్రం తిప్పుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. 2021 నవంబర్​9న బీఆర్ఎస్​ ప్రభుత్వ హయాంలో కేయూలోని నలుగురు ప్రొఫెసర్ల సర్వీస్​ను 2003 నుంచి కొత్త సర్వీస్​తో కలుపుకోవాలని, ప్రమోషన్​బెనిఫిట్స్​తో పాటు ఇతర బెనిఫిట్స్​ను జీవో నెం.208 /1999 ప్రకారం పొందేలా చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశిస్తూ రిజిస్ట్రార్ కు ఉత్తర్వులు వచ్చాయి.

కాగా, ఆ జీవో  ప్రకారం పాత సర్వీస్​ ను పరిగణలోకి తీసుకోవాల్సి వస్తే కేవలం ప్రమోషన్​ బెనిఫిట్స్​మాత్రమే పొందే చాన్స్ ఉంది. కానీ ఆ నలుగురు ప్రొఫెసర్ల విషయంలో మాత్రం ఓల్డ్ పెన్షన్​ బెనిఫిట్స్ వర్తింప చేసే ఆర్డర్స్​కు ఈసీ ఆమోదం పొందాల్సి ఉంటుంది. కాగా, 2021 నవంబర్​లో జరిగిన 136వ ఈసీ మీటింగ్​లో దీనిపై చర్చకు వచ్చినప్పుడు అప్పటి పాలకమండలి ఆ నలుగురు ప్రొఫెసర్లు కేవలం పదోన్నతి బెనిఫిట్స్​కు మాత్రమే అర్హులని, మరే ఇతర పాత పెన్షన్​బెనిఫిట్స్​కు అర్హులు కారని తీర్మానించింది.

అంతేకాకుండా జీవోను మార్చుకుని రావాల్సిందిగా ఈసీ మెంబర్స్ తీర్మానించారు. దీంతో 2022 మార్చి 22న అప్పటి రిజిస్ట్రార్ ప్రొఫెసర్​వెంకటరాంరెడ్డి ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి, జీవో మార్పు కోసం ఉన్నత విద్యాశాఖ కార్యదర్శికి లేఖ కూడా రాశారు. కానీ అది ప్రభుత్వం వద్ద ఇంకా పెండింగ్ లోనే ఉంది. అయితే..  దానిని పక్కన పెట్టి అక్రమ మార్గంలో బై సర్కులేషన్ లో ఆ నలుగురు ప్రొఫెసర్లకు పాత పెన్షన్ విధానం అమలయ్యేలా ప్రయత్నాలు జరుగుతున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. దీంతోనే ఇటీవల తెలంగాణ హ్యూమన్​ రైట్స్​ ప్రొటెక్షన్​ఫోరం నేతలు గత ప్రభుత్వ హయాంలో కేయూ ప్రొఫెసర్ల కోసం ఇచ్చిన ఓపీఎస్​ శాంక్షన్డ్​ జీవోలను రద్దు చేయాల్సిందిగా ఇన్​చార్జ్​ వీసీకి ఫిర్యాదు చేయగా, వర్సిటీలో చర్చనీయాంశమైంది.