కేయూలో విద్యార్థుల ధర్నా

కేయూలో విద్యార్థుల ధర్నా

కేయూ క్యాంపస్, వెలుగు: కాకతీయ యూనివర్సీటీలో కొత్తగా నిర్మించిన కామన్‌ మెస్‌ ను ప్రారంభించాలని డిమాండ్‌ చేస్తూ యూనివర్సిటీ విద్యార్థులు ఆందోళనకు దిగారు. బుధవారం ఓల్డ్ కామన్​ మెస్​ఎదుట బైఠాయించి వర్సిటీ అధికారులకు వ్యతిరేకంగా పాటలు పాడుతూ నిరసన చేపట్టారు. విద్యార్థులు మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్న కామన్‌ మెస్‌లో 1,300 మంది విద్యార్థులు ఒకే సమయంలో భోజనం చేయడానికి ఇబ్బందిగా ఉందన్నారు. తరచూ విద్యార్థుల మధ్య గొడవలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. 

ఆహారం కూడా నాణ్యతగా ఉండటం లేదని, ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని వాపోయారు. కేయూ పోలీసులు అక్కడికి చేరుకుని విద్యార్థులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. చివరకు వర్సిటీ రిజిస్ట్రార్​ ప్రొ.వి.రాంచంద్రం, డెవలప్​మెంట్​ఆఫీసర్ వాసుదేవారెడ్డి అక్కడికి చేరుకుని విద్యార్థులకు సర్ది చెప్పారు. రెండు నెలల్లోగా కొత్త కామన్ మెస్​పనులన్నీ పూర్తి చేసి అందుబాటులోకి తీసుకువస్తామని హామీ ఇచ్చారు.