కుభీరు, వెలుగు: ప్రజలకు అందుబాటులో ఉండి సేవలు అందించాల్సిన అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ డ్యూటీకి ఇన్‌టైమ్‌లో హాజరుకావడంలేదు. దీంతో పలు సమస్యల పరిష్కారం కోసం ఆఫీస్‌లకు వస్తున్న ప్రజలకు ఖాళీ కుర్చీలు దర్శనమిస్తున్నాయి. కుభీర్మండల కేంద్రంలోని పలు కార్యాలయాల్లో పనిచేస్తున్న అధికారులు సమయానికి డ్యూటీకి రావడంలేదు.
ఎంపీడీవో, ఎంపీఓ, సూపరింటెండెంట్ మంగళవారం విధులకు హాజరు కాలేదు. వ్యవసాయ శాఖ ఏవో, ఐకేపీ ఏపీఎంతో పాటు డిప్యూటీ తహసీల్దార్, విద్యాశాఖ అధికారి కుర్చీలు ఖాళీగా కనిపించాయి. ఉన్నతాధికారులు విధులకు హాజరు కాకపోవడంతో కింది స్థాయి అధికారులు విధుల్లో అలసత్వం వహిస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి అధికారులు సకాలంలో కార్యాలయాలకు హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.