బలహీన వర్గాలకు అండగా కాంగ్రెస్ : శ్రీహరి రావు

నిర్మల్‌,వెలుగు: బలహీన వర్గాలకు కాంగ్రెస్ అండగా ఉంటుందని డీసీసీ అధ్యక్షుడు‌‌, కాంగ్రెస్​  అభ్యర్థి  కుచాడి శ్రీహరి రావు అన్నారు. శుక్రవారం పట్టణంలోని మంజులపూర్ కు చెందిన.18,19 వార్డుల్లో  అయన  ప్రచారం  నిర్వహించారు. ఈ  సందర్భంగా కాంగ్రెస్ 6 గ్యారెంటీలను ప్రజలకు వివరించారు. రాష్ట్రంలో  అరాచక పాలన సాగుతోందన్నారు.

++ఈ సందర్భంగా జిల్లా ఒడ్డెర సంఘ జిల్లా అధ్యక్షుడు సంపంగి ప్రభాకర్, వాలకుంట శ్రీనివాస్,శివరాత్రి రవి, అశోక్, నరేష్, పుల్లపు దేవరాజు,  సంఘ సభ్యులు వంద మంది కాంగ్రెస్   లో చేరారు. అలాగే చించొలి, కూరన్న పేట్, రాంనగర్, నాయుడివాడకు చెందిన 200 మంది పార్టీలో చేరారు. అనంతరం పట్టణంలోని ఇస్లాంపురా  వార్డులో  ప్రచారం నిర్వహించి మైనార్టీలు కాంగ్రెస్ కు మద్దతుగా నిలబడాలని కోరారు.