తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్​కు అవకాశం ఇవ్వండి: కూచాడి శ్రీహరి రావు

నిర్మల్‌, వెలుగు: తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ కు రాబోయే ఎన్నికల్లో ఒక్క అవకాశం ఇవ్వాలని ఆ పార్టీ నిర్మల్​ ఎమ్మెల్యే అభ్యర్థి, డీసీసీ అధ్యక్షుడు కూచాడి శ్రీహరి రావు కోరారు. రూరల్ మండలం కౌట్ల(కే) గ్రామంలో బుధవారం ఎన్నికల ప్రచారం నిర్వహించగా గ్రామంలోని మహిళలు మంగళహారతులతో ఆయనకు స్వాగతం పలికారు. ఈ సంద‌ర్భంగా సోనియా గాంధీ ప్రకటించిన ఆరు హామీల పథకాలను ఇంటింటికీ తిరుగుతూ వివరించారు.

కాంగ్రెస్​కు ఓటు వేయాలని అభ్యర్థించారు. పార్టీ గెలుపు కోసం ప్రతి కార్యకర్త కష్టపడి పనిచేయాలని కోరారు. దేశంలోని ప్రజలు శాంతి, సౌభాగ్యాల‌తో జీవించాలంటే అది కేవ‌లం కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాధ్యమతుంద‌న్నారు.