
మాదాపూర్ వెలుగు : మాదాపూర్ శిల్పారామంలో ఆదివారం సాయంత్రం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. షైక్ నాడియా బృందం కూచిపూడి నృత్యంతో మెప్పించింది. నవలాస్య కళా నిలయానికి చెందిన షిహాయ్స్ బృందం కర్ణాటక గాత్ర కచేరి, కూచిపూడి నృత్యంతో ప్రేక్షకుల చూపులను కట్టిపడేసింది.