![బీఆర్ఎస్కు కూచుకుళ్ల రాజీనామా.. సీఎం కేసీఆర్కు లేఖ](https://static.v6velugu.com/uploads/2023/10/kuchukulla-resignation-from-brs-letter-to-cm-kcr_EvT7noJg58.jpg)
- ఎమ్మెల్సీ కొడుక్కి ఇప్పటికే టికెట్ ఇచ్చిన కాంగ్రెస్
హైదరాబాద్: మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్ రెడ్డి ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. ఈమేరకు తన రాజీనామా లేఖను దామోదర్రెడ్డి బీఆర్ఎస్ పార్టీ చీఫ్ సీఎంకేసీఆర్ కు పంపారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో నాగర్ కర్నూల్ కాంగ్రెస్ అభ్యర్థిగా తన కుమారుడికి టికెట్ ఇచ్చిన నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు పేర్కొన్నారు. తనకు పార్టీలో తగిన గుర్తింపు ఇచ్చినప్పటికీ స్థానిక ఇబ్బందులను పట్టించుకోనందునే రాజీనామా చేస్తున్నట్టు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల తొలి జాబితాలోనే దామోదర్ రెడ్డికొడుకు కూచుకుళ్ల రాజేశ్ రెడ్డికి నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే టికెట్ కేటాయించిన విషయం తెలిసిందే.
ALSO READ :- రేవంత్రెడ్డి సీఎం.. నేను మంత్రినైత: కొండా సురేఖ