ఇద్దరు బాలికల మిస్సింగ్ కేసులో ట్విస్ట్... స్కూల్ నుంచి సూర్యలంక బీచ్కు

ఇద్దరు బాలికల మిస్సింగ్ కేసులో ట్విస్ట్... స్కూల్ నుంచి సూర్యలంక బీచ్కు

హైదరాబాద్ కూకట్ పల్లిలో  అదృశ్యమైన ఇద్దరు  విద్యార్థినిలు ఆంధ్రప్రదేశ్ లోని చీరాల సూర్యలంక బీచ్ కు వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. తోటి విద్యార్థుల సమాచారంతో దర్యాప్తు చేసిన కూకట్ పల్లి పోలీసులు ఏపీకి వెళ్లినట్లు గుర్తించి అక్కడి పోలీసులకు సమాచారం ఇచ్చారు.

కూకట్ పల్లిలోని ఆల్విన్ కాలనీలో  హారిక,  తులసి నగర్ లో లక్ష్మీదుర్గ   నివాసం ఉంటున్నారు.  కూకట్‌పల్లి వివేకానంద నగర్, శ్రీ చైతన్య స్కూల్ లో  ఇద్దరు బాలికలు లక్ష్మి దుర్గ,   హారిక 8 వతరగతి చదువుతున్నారు. నవంబర్  20న సాయంత్రం 5:25 నిమిషాలకు స్కూల్ నుంచి ఇంటికి తిరిగి రాకపోవడంతో ఆందోళన గురైన పేరెంట్స్ కూకట్ పల్లి పోలీస్ స్టేషన్ లో  ఫిర్యాదు చేశారు. 

కిడ్నాప్ కేసు నమోదు చేసుకున్న కూకట్ పల్లి పోలీసులు  సీసీ  కెమెరాలు ఆధారంగా దర్యాప్తు చేశారు. అయితే తోటి విద్యార్థుల ద్వారా సమాచారం సేకరించిన పోలీసులు..ఇద్దరు విద్యార్థినిలు సూర్యలంక బీచ్ కు వెళ్లినట్లు గుర్తించారు. అక్కడి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఇద్దరు సేఫ్ గా ఉన్నట్లు గుర్తించారు.