
హైదరాబాద్ కూకట్ పల్లిలో భారీగా గంజాయి బయటపడుతోంది. ఇటీవలే బీటెక్ విద్యార్థులను అరెస్టు చేసిన పోలీసులు.. తాజాగా మరో కాలేజ్ విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు. చదువుకునే సమయంలో డబ్బు కొరకు అడ్డదారులు తొక్కుతూ చివరికి గంజాయి సరఫరాకు అలవాటు పడిన విద్యార్థులను పోలీసులు అరెస్టు చేశారు.
హైదరాబాద్ కూకట్ పల్లి ఏరియాలో గంజాయి సరఫరా జరుగుతున్నట్లు పక్కా సమాచారంతో SOT బాలానగర్ టీం దాడులు నిర్వహించింది. మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హఫీజ్‌పేట రైల్వే స్టేషన్‌లో పట్టుబడ్డారు గంజాయి సప్లయర్స్. వీళ్ల దగ్గర రెండు కిలోల ఏడు వందల గ్రాముల గంజాయిని పట్టుకున్నట్లు సైబరాబాఫ్ SOT బాలానగర్ టీం ప్రకటించింది. రైలులో మహారాష్ట్ర పర్లీలో అమ్జాత్ అనే వ్యక్తి నుంచి గంజాయిని కొనుగోలు చేసి, హైదరాబాద్‌కు తరలించిన్నట్లు సమాచారంతో దాడులు నిర్వహించారు.
కూకట్ పల్లి సిద్ధార్థ కాలేజ్ Occ విద్యార్థులు పాటిబాల వెంకట సత్య నర్సింహ స్వామి (20), గడ్డి దీపక్ వయస్సు (23) లను అరెస్టు చేశారు పోలీసులు. మహారాష్ట్రకు చెందిన అమ్జాద్ పరారీలో ఉన్నాడు. నిందితుల నుంచి రూ.91 వేల విలువైన 2.745Kgల గంజాయి- స్వాధీనం చేసుకున్నారు. అలాగే మొబైల్ ఫోన్-లను కూడా స్వాధీనం చేసుకున్నారు. మియాపూర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.