కూకట్ పల్లి కేపీహెచ్ బీ కాలనీ ఫోరం మాల్ సర్కిల్ దగ్గర కారు బీభత్సం సృష్టించింది. మద్యం మత్తులో అతివేగంగా వచ్చి ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టింది. ప్రమాదానికి కారణమైన వ్యక్తి మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మేనల్లుడని బాధితులు ఆరోపించారు. ఈ ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.
క్షతగాత్రలును స్థానిక ఆసుపత్రికి తరలించారు. అందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. సమాచారం అందుకుున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని.. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.