- లోకేషన్ ఆధారంగా బాధితుడిని రక్షించిన పోలీసులు
కూకట్పల్లి, వెలుగు: ఫ్రెండ్ని కలిసేందుకు మహారాష్ట్రకు కూకట్పల్లికి చెందిన బాలకృష్ణారెడ్డి(48) సోమవారం వెళ్లగా.. కొందరు దుండగులు అతన్ని బంధించి డబ్బు డిమాండ్ చేశారు. బాలకృష్ణారెడ్డి కొడుకు లిఖిత్రెడ్డికి ఫోన్ చేసి తాము మహారాష్ట్ర ఫారెస్టు అధికారులమని , ఫారెస్టులోకి అక్రమంగా ప్రవేశించినందుకు బాలకృష్ణారెడ్డితో పాటు అతని ఫ్రెండ్ని అరెస్టు చేశామని చెప్పారు. తమకు రూ. 50 వేలు ఇస్తే వదిలేస్తామని బెదిరించారు. లిఖిత్రెడ్డి కేపీహెచ్బీ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు సెల్ఫోన్ లొకేషన్ ఆధారంగా ఆచూకీ తెలుసుకుని మహారాష్ట్రలోని జల్గావ్ జిల్లా, ముత్తేయినగర్ పోలీసులకు సమాచారం అందించారు. అక్కడి పోలీసులు లొకేషన్ ఆధారంగా బాలకృష్ణారెడ్డిని దుండగుల బారి నుంచి రక్షించి నగరానికి తరలిస్తున్నారు.