అయ్యా.. వ్యాపారం చేసుకుంటున్నాం.. కూల్చొద్దంటూ కన్నీళ్లతో మహిళల ఆవేదన

అయ్యా.. వ్యాపారం చేసుకుంటున్నాం.. కూల్చొద్దంటూ కన్నీళ్లతో మహిళల ఆవేదన

హైదరాబాద్ లో హైడ్రా దూకుడు పెంచింది.  ఈ రోజు కూకట్ పల్లి నల్ల చెరువులో అక్రమంగా నిర్మించిన భవనాలను కూల్చివేశారు.  దీంతో అక్కడ వ్యాపారం చేస్తున్న చిరు వ్యాపారులు కన్నీటి పర్యంతమయ్యారు.  లక్షలు ఖర్చు పెట్టి వ్యాపారం చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నామని.. వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేశారు.  మహిళలు ఏడుస్తూ అధికారులను వేడుకుంటున్నా .. హైడ్రా అధికారులు వారి పని వారు చేశారు.  

గతంలోనే 16 వ్యాపార సముదాయాలకు నోటీసులు ఇచ్చామని.. ఈ రోజు ( సెప్టెంబర్ 22) కూల్చివేశామని అధికారులు చెప్తున్నారు.గత ప్రభుత్వంలో పదేళ్లుగా ఇక్కడ వ్యాపారాలు చేస్తున్నారని ఇప్పుడు ఉన్నపలంగా కూల్చివేతలు చేయడం పట్ల అసహనం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా పేదవారిపట్ల దయ చూపాలని వారు వేడుకుంటున్నారు.

కూకట్ పల్లిలోని నల్లచెరువు మొత్తం విస్తీర్ణం 27 ఎకరాలు. అయితే, దీనిలో ఎఫ్టీఎల్, బఫర్ జోన్లో ఏడు ఎకరాలు ఆక్రమణకు గురైంది. బఫర్ జోన్లోని నాలుగు ఎకరాల్లో 50కిపైగా పక్కా భవనాలు, అపార్టు మెంట్లు నిర్మించారు. ఎఫ్టీఎల్ లోని మూడు ఎకరాల్లో 25 భవనాలు, 16 షెడ్లు ఉన్నాయి. ప్రస్తుతం 16షెడ్లను హైడ్రా కూల్చివేసింది.