కెపిహెచ్బి శివ పార్వతి థియేటర్ లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. హైదరాబాద్‌లో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డు సమీపంలో ఉన్న శివపార్వతి థియేటర్‌లో ఈ తెల్లవారు జామున మంటలు అంటుకున్నాయి. థియేటర్ మొత్తం తగులబడింది. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టారు. మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఈ ఘోర అగ్నిప్రమాదానికి షార్ట్ సర్క్యూటే కారణమా లేక మరేదైనా కుట్ర ఉండొచ్చా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదని తెలుస్తోంది. ఆస్తినష్టం మాత్రం భారీగా సంభవించింది. కోట్ల రూపాయల మేర ఆస్తి నష్టం సంభవించి ఉండొచ్చనే అభిప్రాయాలు ఉన్నాయి. దీనిపై స్థానిక రెవెన్యూ, పోలీసు అధికారులు విచారణకు ఆదేశించారు. మంటలు చెలరేగిన సమయంలో థియేటర్‌లో ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది.
ఇవి కూడా చదవండి: