T20 World Cup 2024: స్పిన్ మాంత్రికుడికి చోటు.. ఆఫ్ఘన్‌తో తలపడే భారత తుది జట్టు ఇదే!

T20 World Cup 2024: స్పిన్ మాంత్రికుడికి చోటు.. ఆఫ్ఘన్‌తో తలపడే భారత తుది జట్టు ఇదే!

టీ20 ప్రపంచకప్‌లో భారత జట్టుకు గురువారం (జూన్ 20) అసలు పరీక్ష ఎదురు కానుంది. లీగ్ దశ ముగించుకొని కీలకమైన సూపర్ 8 మ్యాచ్ ఆడేందుకు సిద్ధమైంది. తొలి పోరులో కెన్సింగ్టన్ ఓవల్‌(బార్బడోస్‌) వేదికగా ఆఫ్ఘనిస్తాన్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. ఈ కీలక పోరులో భారత జట్టు ఒకమార్పుతో బరిలోకి దిగే అవకాశం ఉంది. 

బ్యాటింగ్‌కు కష్టంగా ఉన్న అమెరికా పిచ్‌లపై లీగ్ దశ మ్యాచ్‌లు ఆడిన టీమిండియా.. అందుకు పూర్తి భిన్నంగా ఉండే కరేబియన్  పిచ్‌లపై సూపర్ 8 మ్యాచ్‌లు ఆడనుంది. విండీస్ పిచ్‌లు స్పిన్ కు అనుకూలంగా ఉంటాయి. దీంతో టీమిండియా ప్లేయింగ్‍లో మణికట్టు మాంత్రికుడు కుల్దీప్ యాదవ్‌కు తుది జట్టులో చోటు కల్పించాలని భావిస్తోందట. అదే జరిగితే హైదరాబాదీ పేసర్ మహమ్మద్ సిరాజ్ పై వేటు పడడం గ్యారంటీ. 

నలుగురు ఆల్‌రౌండర్లు

హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, జడేజా రూపంలో నలుగురు ఆల్‌రౌండర్లు జట్టులో కొనసాగనున్నారు. బుమ్రా, ఆర్షదీప్ సింగ్ అలీతో పాటు హార్దిక్ పాండ్య పేస్ బౌలింగ్ బాధ్యతలు పంచుకోనున్నాడు. కుల్దీప్, అక్షర్ పటేల్, జడేజా రూపంలో ముగ్గురు స్పిన్నర్లు ఉండనే ఉన్నారు. మున్ముందు కూడా భారత జట్టు ఇదే వ్యూహాన్ని అనుసరించనున్నట్లు తెలుస్తోంది.

కోహ్లీ, రోహిత్ ఓపెనింగ్

ఇక బ్యాటింగ్ విషయానికి వస్తే ఎలాంటి మార్పులు చోటు చేసుకునే అవకాశం కనిపించడం లేదు. రోహిత్‌తో కలిసి విరాట్ కోహ్లీ ఓపెనింగ్ చేయడం దాదాపు ఖాయం.రిషబ్ పంత్, సూర్య కుమార్ యాదవ్.. మూడు,నాలుగు స్థానాల్లో వస్తారు. దూబే, హార్దిక్, జడేజా, అక్షర్ పటేల్ ఆల్‌రౌండర్లుగా వరుసగా ఐదు, ఆరు, ఏడు, ఎనిమిది స్థానాల్లో బ్యాటింగ్ చేయనున్నారు.

భారత జట్టు(అంచనా): రోహిత్ శర్మ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, రిషభ్ పంత్(వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, జస్‌ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్.