IND vs ENG: అయ్యయ్యో పోపా..! అర్థం కాని బాషతో దెబ్బకొట్టిన  కుల్దీప్, జురెల్

IND vs ENG: అయ్యయ్యో పోపా..! అర్థం కాని బాషతో దెబ్బకొట్టిన  కుల్దీప్, జురెల్

ధర్మశాల టెస్టులో ఇంగ్లాండ్ కు గొప్ప శుభారంభం అందింది. తొలి సెషన్ లో కుల్దీప్ యాదవ్ మినహా మిగిలిన భారత బౌలర్లు వికెట్లు తీయడంలో విఫలమయ్యారు. తొలి సెషన్ లో భారత్ కు దక్కిన రెండు వికెట్లు కుల్దీప్ ఖాతాలోకే వెళ్లాయి. అయితే ఈ రెండు వికెట్లు పడడంలో కూడా ఫీల్డర్లు కీలక పాత్ర పోషించారు. బెన్ డకెట్ ఇచ్చిన క్యాచ్ ను రన్నింగ్ చేస్తూ పట్టి గిల్ తన ఫీల్డింగ్ విన్యాసంతో మెప్పించాడు. ఇక ఈ సెషన్ లో హైలెట్ ఏదైనా ఉందంటే అది పోప్ వికెట్ అనే చెప్పాలి. 

స్పిన్నర్లను ఎదుర్కునే క్రమంలో పోప్ పదే పదే క్రీజ్ ధాటి బయటకు వస్తున్నాడు. ఇది గమనించిన వికెట్ కీపర్ జురెల్ సమయస్ఫూర్తి ప్రదర్శించాడు. బడేగా ఆగే బడేగా ఆగే అని హిందీలో మాట్లాడుతూ పోప్ ను కన్ఫ్యూషన్ లో పడేసాడు. ఇది అర్ధం చేసుకున్న కుల్దీప్ యాదవ్  లెంగ్త్ షార్ట్ చేస్తూ మంచి గూగ్లీ వేశాడు. ఈ బంతిని అంచనా వేయలేకపోయిన పోప్ సగం పిచ్ వరకూ వచ్చేశాడు. బంతి మిస్ కావడంతో జురెల్ పోప్ ను స్టంపౌట్ చేశాడు. 

ఈ ఔట్ తో ఈ వికెట్ కీపర్ మీద ప్రశంసలు కురుస్తున్నాయి. వికెట్ల వెనకాల చాలా చురుగ్గా ఉంటూ తన పాత్రను సమర్ధవంతంగా పోషిస్తున్నది అంటున్నారు. ఇక ఈ మ్యాచ్ విషయానికి వస్తే ప్రస్తుతం ఇంగ్లాండ్ 2 వికెట్ల నష్టానికి 132 పరుగులు చేసింది. క్రీజ్ లో క్రాలే (78), రూట్ (13) ఉన్నారు.