కుసుమోటో (జపాన్): ఇండియా స్టార్ షట్లర్ పీవీ సింధు.. జపాన్ మాస్టర్స్ సూపర్–500 టోర్నీలో ప్రిక్వార్టర్స్‌లోకి ప్రవేశించింది. బుధవారం జరిగిన విమెన్స్ సింగిల్స్ తొలి రౌండ్‌లో అన్‌సీడెడ్ సింధు 21–12, 21–8తో ఎనిమిదోసీడ్ బుసానన్ (థాయ్‌లాండ్)పై గెలిచింది.
38 నిమిషాల మ్యాచ్‌లో తెలుగమ్మాయి తన ట్రేడ్ మార్క్ షాట్లతో చెలరేగింది. తొలి గేమ్‌లో 1–3, 1–5తో వెనకబడినా తర్వాత బలమైన స్మాష్‌లతో 10–10తో స్కోరు సమం చేసింది. ఇక్కడి నుంచి వరుసగా రెండు, మూడు, ఆరు పాయింట్లు నెగ్గి గేమ్‌ను సొంతం చేసుకుంది. రెండో గేమ్‌లో మరింత కచ్చితమైన షాట్లు కొట్టిన సింధు.. బుసానన్‌కు పుంజుకునే చాన్స్ ఇవ్వలేదు. 4–0తో మొదలైన గేమ్‌లో 10–4, 20–8తో దూసుకెళ్లింది. మెన్స్ సింగిల్స్‌లో లక్ష్యసేన్ తొలి రౌండ్లోనే ఇంటిముఖం పట్టాడు. 22–20, 17–21, 16–21తో లియోంగ్ జున్ హో (మలేసియా) చేతిలో పోరాడి ఓడాడు. గంటా 14 నిమిషాల మ్యాచ్‌లో ఇండియన్ ప్లేయర్‌కు ప్రత్యర్థి నుంచి గట్టి పోటీ ఎదురైంది.