ఐపీఓకు కుమార్ ఆర్చ్ టెక్

ఐపీఓకు  కుమార్ ఆర్చ్ టెక్

న్యూఢిల్లీ: పీవీసీ మిశ్రమం ఆధారిత బిల్డింగ్ మెటీరియల్స్‌‌‌‌ను  తయారు చేసే కుమార్ ఆర్చ్ టెక్  ఐపీఓ ద్వారా రూ. 740 కోట్లు సమీకరించడానికి క్యాపిటల్ మార్కెట్స్ రెగ్యులేటర్ సెబీకి ప్రాథమిక పత్రాలను దాఖలు చేసింది. ఈ పబ్లిక్​ఇష్యూలో రూ. 240 కోట్ల విలువైన షేర్ల ఫ్రెష్‌‌​ ఇష్యూ, ప్రమోటర్ల ద్వారా రూ. 500 కోట్ల విలువైన షేర్ల ఆఫర్- ఫర్- సేల్ ఉంటుంది.  

ప్రీ-ఐపిఓ ప్లేస్‌‌‌‌‌‌‌‌మెంట్ రౌండ్‌‌‌‌‌‌‌‌లో కంపెనీ రూ. 48 కోట్లు సంపాదించవచ్చు. ఈ ప్లేస్‌‌‌‌‌‌‌‌మెంట్ జరిగితే, తాజా ఇష్యూ పరిమాణం తగ్గుతుంది.  తాజా ఇష్యూ ద్వారా రూ. 182.09 కోట్ల వరకు వచ్చే ఆదాయాన్ని, పీవీసీ ఆధారిత ఉత్పత్తుల తయారీకి సంబంధించి గ్రీన్‌‌‌‌‌‌‌‌ఫీల్డ్ ప్రాజెక్ట్ కోసం, ఇతర అవసరాల కోసం ఉపయోగిస్తుంది.